తెలంగాణ

తెలుగులో ప్రసంగం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన భారత గణతంత్ర వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించి, ఇంగ్లీషులో కొనసాగించి చివరకు తెలుగుతో ముగించారు. ‘తెలంగాణ ప్రజలకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు’ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగం పూర్తయిన తర్వాత చివరలో ‘అందరికీ ధన్యవాదాలు’ అంటూ ముగించారు. ఉదయం 10.40 గంటలకు ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం 11.05 గంటలకు ముగిసింది. ప్రసంగానికి ముందు పోలీసుల నుండి గవర్నర్ గౌరవ వందనం స్వీకరించారు. గణతంత్ర వేడుకల్లో
పాల్గొనేందుకు రాజ్‌భవన్ నుండి పబ్లిక్ గార్డెన్స్‌కు 10.30కు చేరన గవర్నర్ తమిళిసైకి ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ తదితరులు స్వాగతం పలికారు. వేడుకలు పూర్తయిన తర్వాత మళ్లీ ఆమెకు వీడ్కోలు పలికారు. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రితో పాటు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, శ్రీనివాస యాదవ్ తదితర మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డులను ప్రధాన చేశారు. రాష్టస్థ్రాయిలో గణతంత్ర వేడుకలు ఆహ్లాదకర వాతావరణంలో జరిగాయి.

'చిత్రం... వేడుకలో ప్రసంగిస్తున్న గవర్నర్ తమిళి సై