తెలంగాణ

ఆదర్శ రాష్ట్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముం దుకు తీసుకువెళ్లి, దేశంలోనే ఆదర్శరాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత శ్రద్ధగా పనిచేస్తోందని, ప్ర భుత్వానికి ప్రజలు ఈ విషయంలో పూర్తిగా సహకారం అందించాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో ఆదివారం ఉదయం ఏర్పాటు చేసిన రాష్టస్థ్రా యి ఉత్సవంలో ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ప్రజా సంక్షేమంలో, వౌలిక సదుపాయాల కల్పనలో, వ్యవసాయ, పారిశ్రామిక రం గాల్లో తెలంగాణ అనతికాలంలోనే అత్యున్నత ఫలితాలు సాధించిందని ఆమె అన్నారు. ప్రగతికాముక రాష్ట్రం గా నేడు దేశం ముందు తెలంగాణ నిలబడిందన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి వస్తు న్న అవార్డులు, ప్రశంసలే ఇందుకు ఉదాహరణగా నిలుస్తున్నాయన్నారు. నీతివంతంగా, నిజాయితీతో ప్రభు త్వం పనిచేస్తోందని, అదే సమయం లో అవసరమైతే కఠినంగా కూడా వ్యవహరిస్తోందని గవర్నర్ అన్నారు.
సమైక్య రాష్ట్రంలో జరిగిన విధ్వం సం సృషించిన అగాధం నుండి తెలంగాణ వేగంగా కోలుకుని, అభివృద్ధిపథంలో
ముందుకు వెళుతోందని గవర్నర్ తమిళిసై కితాబిచ్చారు. వివిధ రంగాల్లో నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధిస్తూ, గత ఆరేళ్లలో బలమైన పునాదులు నిర్మించుకున్నదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఆత్మవిశ్వాసంతో ముందుకు దూసుకువెళుతోందన్నారు. ‘స్వరాష్ట్రంలో సుపరిపాలన’ నినాదంతో ప్రభుత్వం పరిపాలనా రంగంలో కొత్తపుంతలు తొక్కుతోందన్నారు. కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేయడం ద్వారా మొత్తం 33 జిల్లాలను ఏర్పాటు చేసినట్టు గవర్నర్ తెలిపారు. రెవెన్యూ డివిజన్లను 43 నుండి 69కి పెంచామని, మండలాల సంఖ్యను 459 నుండి 584కు పెంచామని, మున్సిపాలిటీల సంఖ్యను 68 నుండి 142కు పెంచామని ఆమె తెలిపారు. అలాగే గ్రామ పంచాయతీల సంఖ్యను 8,690 నుండి 12,751కి పెంచామని వివరించారు. పరిపాలనా విభాగాలు చిన్నగా ఉండడం వల్ల అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా, సమర్థంగా ప్రజలకు చేరతాయన్నారు.
కొత్త చట్టాలు
సంస్కరణల రెండో దశలో కొత్తగా చట్టాలను తీసుకువస్తున్నట్టు గవర్నర్ తెలిపారు. ప్రగతికి అవరోధాలైన అవినీతిని, జాప్యాన్ని తరిమికొట్టాలన్నారు. పల్లెలు, పట్టణాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుచేశామన్నారు. ఖర్చు చేసే ప్రతిపైసా సద్వినియోగం కావాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ప్రతిచోటా పరిశుభ్రత ఉండాలని, రాష్టమ్రంతటా హరితమయం కావాలన్నదే తమ ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఇందుకోసమే పంచాయతీరాజ్ చట్టం, మున్సిపాలిటీల చట్టాల్లో సమూల మార్పులు, చేర్పులు చేసి కొత్త చట్టాలను రూపొందించామన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎవరి విధులు వారు నిర్వర్తించేందుకు కొత్త చట్టాలు ఉపయోగపడతాన్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న రెవెన్యూ చట్టంలో కూడా మార్పులు, చేర్పులు చేస్తూ, కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని గవర్నర్ తెలిపారు. ఇప్పటికే సమగ్ర భూరికార్డుల ప్రక్షాళన జరిగిందన్నారు. భూముల లావాదేవీల్లో పారదర్శకత పాటిస్తూ, సరళమైన విధానాలను రూపొందించేందుకు ప్రయత్నం జరుగుతోందన్నారు. రిజిస్ట్రేషన్ విధానంలో ఎలాంటి జాప్యం లేకుండా కొత్త చట్టం ఉపయోగపడుతుందన్నారు.
పల్లెలను బాగు చేసుకునేందుకు రెండు పర్యాయాలు ‘పల్లెప్రగతి’ కార్యక్రమాన్ని చేపట్టామని గవర్నర్ తమిళిసై తెలిపారు. ప్రభుత్వ పిలుపుతో ప్రజలు కదిలి, వారి వారి గ్రామాలను తీర్చిదిద్దుకుంటున్నారని గుర్తు చేశారు. పారిశుద్ధ్యానికి ప్రాధాన్యత ఇచ్చామని, మురిగు గుంటలు లేకుండా చేశామని, పాత ఇళ్ల శిథిలాలను తొలిగించామన్నారు. చెత్త వేసేందుకు డంపింగ్ యార్డులు ఏర్పాటయ్యాయని, విద్యుత్ సరఫరా సమర్థంగా మారిందన్నారు. పల్లెప్రగతి కార్యక్రమానికి ముందు-ఆ తర్వాత గ్రామాల్లో పరిస్థితి ఎంతో మారిందన్నారు. పల్లెప్రగతి కోసం ప్రతి నెలా 339 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నామని తెలిపారు.
త్వరలో పట్టణ ప్రగతి
పల్లె ప్రగతి దారిలోనే త్వరలోనే ‘పట్టణ ప్రగతి’ కార్యక్రమం రూపొందిస్తున్నామని తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రజలంతా పాల్గొంటూ, ఎవరి పట్టణాన్ని వారే ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు తమ బడ్జెట్‌లో పది శాతం నిధులను పచ్చదనం పెంపకం కోసం ఉపయోగించాలని ఆమె సూచించారు.
సంక్షేమం
తమ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తోందని గవర్నర్ తెలిపారు. ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, పేదలకు నెలకు ఆరు కిలోల బియ్యం, కేసీఆర్ కిట్స్ తదితర పథకాలు విజయవంతంగా అమలవుతున్నాయన్నారు. రైతులకు పంటల పెట్టుబడి కోసం రైతుబంధు పథకం కింద ఏటా ఒక్కో ఎకరానికి 10 వేల రూపాయలు ఇస్తున్నామని, పంటలకు కనీస మద్దతు ధర లభించేలా చూస్తున్నామన్నారు. ఏ కారణం చేతనైనా రైతు మరణించినా రైతు బీమా పథకం కింద ఐదు లక్షల రూపాయలు ఇస్తున్నామన్నారు. రైతు సమన్వయ సమితులు సమర్థంగా పనిచేసేందుకు చర్యలు తీసుకున్నామన్నారు.
కోటి ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని గవర్నర్ తెలిపారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, దేవాదుల, సీతారామ తదితర నీటిపారుదల ప్రాజెక్టులను చేపట్టామన్నారు. కృష్ణానదిలో అవసరమైన నీరు లేకపోవడం వల్ల గోదావరి జలాలను కృష్ణానదికి తరలించేందుకు బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులు, కుంటల మరమ్మతులు చేశామన్నారు. మిషన్ భగీరథ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తాగునీటిని అందిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో కనురెప్పపాటు కూడా కోత లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని గవర్నర్ తెలిపారు. వ్యవసాయ బావులకు ఉచితంగా విద్యుత్తు ఇస్తున్న రాష్ట్రంగా తెలంగాణకు పేరు వచ్చిందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల కోసం గురుకులాలను ఏర్పాటు చేశామన్నారు. సంపూర్ణ అక్షరాస్యత సాధించేందుకు త్వరలోనే కార్యాచరణ ప్రణాళిక ప్రకటిస్తామన్నారు. ప్రజలందరికీ వైద్యం అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామన్నారు. పచ్చదనం పెంపుదల కోసం హరితహారం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నామని వివరించారు. పారిశ్రామిక రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. ఐటీ ఎగుమతులు గత ఆరేళ్లలో రెట్టింపయ్యాయన్నారు.
హైదరాబాద్ నగరం బెస్ట్ లివబుల్ సిటీగా పేరు వచ్చిందని, ప్రపంచంలోని 130 అతిపెద్ద నగరాల్లో అధ్యయనం చేసిన ప్రఖ్యాత జేఎల్‌ఎల్ సంస్థ 20 అగ్రశ్రేణి నగరాల పేర్లను ప్రకటించిందని, వీటిలో హైదరాబాద్‌కు పేరు దక్కడం గొప్ప విజయమని గవర్నర్ తమిళిసై తెలిపారు.

'చిత్రం... నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఆదివారం జాతీయ జెండాను ఎగుర వేస్తున్న గవర్నర్ తమిళిసై