తెలంగాణ

కేటీఆర్‌కు అరుదైన గౌరవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ వేదికపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు అరుదైన గౌరవం దక్కింది. దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనడాదికి కేటీఆర్ వెళ్లిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాధినేతలు, కేంద్ర ప్రభుత్వాల్లో పాలసీ నిర్ణేతలు, కేంద్ర మంత్రులకు మాత్రమే గ్యాదరింగ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ లీడర్స్ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ సమావేశానికి ప్రత్యేక ఆహ్వానితునిగా మంత్రి కేటీఆర్‌కు
కీపింగ్ పేస్ టెక్నాలజీ గవర్నెస్ ఎట్ క్రాస్ రోడ్స్ అంశంపై ప్రసంగించే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. రాష్ట్ర స్థాయి ఆహ్వానితుల నుంచి ఈ సదస్సుకు హాజరైన వారిలో కేటీఆర్ ఒక్కరికే అవకాశం లభించింది. ఈ సందర్భంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరం మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక బ్యాడ్జ్‌ని అందజేసింది. ఈ సమావేశంలో వివిధ దేశాలకు చెందిన ప్రధాన మంత్రులు, సీనియర్ కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. సెర్బియా ప్రధాన మంత్రి అనా బ్రనబిక్, పోలాండ్ ప్రధాని ఈస్టోనియా, బ్రెజిల్, సింగపూర్, కొరియా, ఇండోనిషియా, ఒమన్, ఇథోపియా దేశాలకు చెందిన సీనియర్ కేంద్ర మంత్రులు పాల్గొన్న ఈ వేదికపై కేటీఆర్ ప్రసంగించడం విశేషం.
పలువురు పారిశ్రామికవేత్తలతో భేటీ
దావోస్‌లో జరుగుతోన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం మూడవ రోజు సదస్సులో మంత్రి కేటీఆర్ పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రపంచ దేశాల నాయకులతో సమావేశమయ్యారు. సౌదీ కమ్యూనికేషన్స్ మంత్రి అబ్దుల్లా ఆల్ స్వాహతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. హైదరాబాద్‌లో ఉన్న వ్యాపార, వాణిజ్య అవకాశాల పరిశీలనకు తెలంగాణకు రావాల్సిందిగా ఆయన్ను ఆహ్వానించారు. డెన్మార్క్‌కు చెందిన మల్టీ నేషనల్ ఫార్మా కంపెంనీ నోవో నోర్ డిస్క్‌తో, మైక్రన్ టెక్నాలజీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ సంజయ్ మహోత్ర, కోకో కోలా కంపెనీ సీఈవో జేమ్స్ క్వెన్సి, యూట్యూబ్ సీఈవో సుపాన్ వొజ్విక్కితో సమావేశమై హైదరాబాద్‌లో ఉన్న లైఫ్ సైనె్సస్, ఫార్మా, డిజిటల్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాలలో పెట్టుబడులకున్న అవకాశాలను మంత్రి కేటీఆర్ వివరించారు.

''చిత్రాలు.. దావోస్‌లో గురువారం కోకో కోలా కంపెనీ సీఈవో జేమ్స్, కొరియా పరిశ్రమలు, స్టార్టప్ మంత్రి యంగ్ సన్‌తో మంత్రి కేటీఆర్