తెలంగాణ

మున్సి‘పోల్ ’ కొలువుల వేళాయె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 23: తెలంగాణలో మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, డిప్యూటీ మేయర్లతో పాటు మున్సిపాలిటీల చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వీ. నాగిరెడ్డి పేరుతో గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. తెలంగాణ మున్సిపల్ చట్టం, 2019లోని (2019 చట్టం 11) 194 (1), 195 (1) సెక్షన్లకు అనుగుణంగా మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశామని నాగిరెడ్డి వివరించారు. ప్రతి మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీకి ఒక గెజిటెడ్ అధికారిని ఎన్నికల నిర్వహణ కోసం నియమించాలని జిల్లా కలెక్టర్లకు నాగిరెడ్డి ఈ నోటిఫికేషన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారు. తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీలకు కలిపి 129 మంది గెజిటెడ్ అధికారులను ప్రత్యేకంగా నియమించాల్సి ఉంటుంది.
మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికల కోసం నియామకం అయ్యే గెజిటెడ్ అధికారులు ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారికంగా ఈనెల 25 న లేదా అంతకు ముందే నోటీస్ ఇవ్వాలని నాగిరెడ్డి ఆదేశించారు. మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికయ్యే కార్పొరేటర్లు, మున్సిపాలిటీలకు ఎన్నికయ్యే కౌన్సిలర్లు ఈ నెల 27 న ఉదయం 11 గంలకు పదవీ ప్రమాణం చేయాల్సి ఉంటుంది.
ఇందుకోసం ఆయా మున్సిపల్ కార్యాలయాలు, కార్పొరేషన్ కార్యాలయాలు లేదా అనువైన మరో స్థలాన్ని ఎంపిక చేస్తారు. జనవరి 27న మధ్యాహ్నం 12.30 గంటలకు మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్ల ఎన్నికల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. కార్పొరేషన్ల మేయర్ల ఎన్నిక జరిగిన తర్వాతనే డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
అలాగే, మున్సిపాలిటీల చైర్‌పర్సన్ల ఎన్నిక ముగిసిన తర్వాతనే వైస్-చైర్‌పర్సన్ల ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఏదైనా కారణాల వల్ల మేయర్లు, చైర్‌పర్సన్ల ఎన్నిక జరగకపోతే, మరురోజు అంటే ఈ నెల 28న తిరిగి సమావేశం నిర్వహించి ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ నాగిరెడ్డి స్పష్టం చేశారు.

రేపు కౌంటింగ్
ఈనెల 22న జరిగిన పోలింగ్ తర్వాత బ్యాలెట్ బాక్సులన్నీ స్ట్రాంగ్‌రూంలకు తరలించారు. స్ట్రాంగ్ రూంల వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. రాష్టవ్య్రాప్తంగా 25న ఒట్ల లెక్కింపు ఉంటుంది. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఒక ప్రతి కార్పొరేషన్, ప్రతి మున్సిపాలిటీలోని అన్ని వార్డుల ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకు నిరంతరాయం కౌంటింగ్ కొనసాగుతుంది. 25న లెక్కింపు పూర్తి కాకపోతే ఆ మరుసటి రోజు కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. కౌంటింగ్ పూర్తి కాగానే ఫలితాలు వెల్లడిస్తారు.
'చిత్రం...మిర్యాలగూడలో కౌంటింగ్ ఏర్పాట్లలో నిమగ్నమైన అధికార యంత్రాంగం