తెలంగాణ

చెదురుమదురు ఘటనలు మినహా.. సజావుగా పుర పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జనవరి 22: ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ప్రతిష్టాత్మకంగా భావించిన మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బుధవారం నాటి పోలింగ్ ప్రక్రియ సందర్భంగా చెదురుమదురు ఘటనలు చోటుచేసుకోవడం స్వల్ప ఉద్రిక్తతలకు తావిచ్చింది. నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, కామారెడ్డి, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల్లోని ఆయా పోలింగ్ కేంద్రాల వద్ద అభ్యర్థులు, పోలింగ్ ఏజెంట్లు పరస్పరం ఘర్షణలకు దిగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి లాఠీలకు పని చెప్పారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్‌లోని చంద్రశేఖర్‌కాలనీలో తెరాస అభ్యర్థి చాంగుబాయి మద్దతుదారులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసేందుకు నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారని అభియోగం మోపుతూ బీజేపీ అభ్యర్థి సంగీత భర్త వినోద్ తదితరులు పోలింగ్ కేంద్రం ఎదుటే నిరసన తెలిపారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ జరిపి వినోద్‌తో పాటు మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ ఎం.పీ ధర్మపురి అర్వింద్ చంద్రశేఖర్‌కాలనీకి చేరుకుని పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అధికార తెరాస పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ పార్టీ కార్యకర్తలను ఎందుకు అదుపులోకి తీసుకున్నారని ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌తో వాగ్వాదం జరిపారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీచార్జ్ జరిపిన మూడవ టౌన్ ఎస్‌ఐ సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులతో కలిసి వెళ్లి అదనపు డీసీపీ శ్రీ్ధర్‌రెడ్డికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. జిల్లా కేంద్రంలోని మరికొన్ని డివిజన్లలో కూడా తెరాస, బీజేపీ కార్యకర్తల మధ్య పోలింగ్ సందర్భంగా ఘర్షణపూరిత వాతావరణం ఏర్పడగా, ఎక్కడికక్కడ పోలీసులు రంగప్రవేశం చేస్తూ పరిస్థితి అదుపు తప్పకుండా చూశారు. కాగా, కామారెడ్డిలోనూ తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పోలింగ్ ఏజెంట్ల మధ్య గొడవ ఏర్పడి అది కాస్తా ఘర్షణకు దారితీయడంతో పోలీసులు ఇరు వర్గాలను కట్టడి చేసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.
నా ముక్కు కొరికాడు
బోధన్ పట్టణంలోని 32వ వార్డులో తెరాస నాయకులు దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్ అభ్యర్థి ఆరోపించిన సందర్భంగా ఘర్షణ నెలకొంది.
ఈ సందర్భంగా కాంగ్రెస్ అభ్యర్థి జరిపిన దాడిలో తెరాస అభ్యర్థికి గాయాలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి తన ముక్కును కొరికాడని టీఆర్‌ఎస్ అభ్యర్థి ఆరోపించారు. ఎమ్మెల్యే షకీల్ బాధితుడిని పరామర్శించి, దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డిలో తెరాస ఎమ్మెల్యే బైక్ ర్యాలీని చేపట్టి ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ నాయకులు ధర్నాకు పూనుకోగా, పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు. ఇలా చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగింది. నిజామాబాద్ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలలో సగటున 64.40 శాతం ఓటింగ్ నమోదైంది. నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలో 61.12 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకోగా, ఆర్మూర్‌లో 72.40, బోధన్‌లో 72.32, భీమ్‌గల్‌లో 71.80 శాతం పోలింగ్ నమోదైంది.
''చిత్రాలు.. వనపర్తిలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి..
* మహబూబ్‌నగర్‌లో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ఓటుహక్కును వినియోగించుకున్న దృశ్యాలు
* నాగార్జునసాగర నందికొండ మున్సిపాల్టీలో ఓటు వేసిన అనంతరం తమ వేళ్లపై గుర్తులు చూపిస్తున్న జానారెడ్డి కుటుంబం