తెలంగాణ

ప్రజాస్వామ్యం అపహాస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి, దాడులకు, ప్రలోభాలకు, అక్రమాలకు పెద్ద ఎత్తున పాల్పడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. టీఆర్‌ఎస్ నాయకులు బహిరంగంగా , యథేచ్ఛగా ఓటర్లను పెద్ద ఎత్తున ప్రలోభాలకు ప్రయత్నించగా పోలీసు యంత్రాంగం, ఎన్నికల అధికారులు చూసీచూడనట్టే వ్యవహరించారని దుయ్యబట్టారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ అభ్యర్ధులు, నాయకులు, కార్యకర్తలపై దాడులు జరిగినా పోలీసులు మిన్నకుండిపోయారని మండిపడ్డారు. ఎలాగైనా గెలిచి తీరాలన్న టీఆర్‌ఎస్ అధినేత ఆదేశాలకు అనుగుణంగా టీఆర్‌ఎస్ నేతలు అన్ని రకాలుగా అడ్డదారులు తొక్కారని అన్నారు. ఎన్నికలంటే విపరీతంగా డబ్బు ఖర్చు చేయడం అన్నట్టు మార్చేశారని ఆరోపించారు. ఆరేళ్ల పాలన, పథకాలే తమను గెలిపిస్తాయని చెప్పిన కేటీఆర్ చివరి రోజు పోలింగ్ అక్రమాలను, దౌర్జన్యాలనే నమ్ముకున్నారని, టీఆర్‌ఎస్ పోలీసులను తమ సొంత బౌన్సర్లుగా ఉపయోగించుకుందని అన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ప్రగతి సాధించామని చెబుతున్నారని, కానీ ఈ ఎన్నికల్లో బీజేపీని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్ విశ్వప్రయత్నాలు చేసిందని అన్నారు. దొంగవోట్లు వేయించేందుకు ఇతర ప్రాంతాల నుండి కూడా మహిళలను రప్పించారని ఆరోపించారు. ముందుగానే దొంగ వోట్లను చేర్పించడమే గాక, బీజేపీ కార్యకర్తల ఓట్లనూ తొలగించారని అన్నారు. నిజామాబాద్‌లో దొంగ వోట్లు వేయడానికి ఇతర ప్రాంతాల నుండి వచ్చిన 10 మంది మహిళలను పోలీసులు అరెస్టు చేశారని, జగిత్యాలలో ఏకంగా టీఆర్‌ఎస్ అభ్యర్థి కప్పుల శ్రీకాంత్, ఆయన అనుచరులు ఏకంగా పోలింగ్ బూత్‌లో కూర్చుని ఓటర్లను ప్రభావితం చేశారని, ఎన్నికల అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాశారని అన్నారు. పరకాల మున్సిపాల్టీలోని 21వ వార్డులో బీజేపీ కార్యకర్తలపై టీఆర్‌ఎస్ నాయకులు దాడికి పాల్పడ్డారని, ఈ ఎన్నికల్లో దేశంలోనే తొలిసారి కొంపల్లిలో ఫేస్ రికగ్నిషన్ యాప్ వినియోగించడం స్వాగతించదగిన అంశమని అన్నారు. దీని ద్వారా దొంగ ఓట్లను తొలగించే అవకాశం ఉందని, దీనిని సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రం అంతా వినియోగించాలని చెప్పారు. ఈ యాప్‌ను ఎంఐఎం వ్యతిరేకిస్తోందంటే దానికి కారణం వారు దొంగ ఓట్లను నమ్ముకోవడమేనని పేర్కొన్నారు. అధికార పార్టీ ఎన్ని అక్రమాలకు పాల్పడినా, బీజేపీ విజయం తథ్యమని, ఈసారి మున్సిపాల్టీల్లో కాషాయ జండా ఎగరడం ఖాయమని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజల తీర్పు టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని స్పష్టం చేస్తుందని అన్నారు.
'చిత్రం... సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్