తెలంగాణ

ఆరు యూనివర్సిటీల్లో కామర్సు గ్రాడ్యుయేట్ల సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణలో కామర్స్ గ్రాడ్యూయేట్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు, ఔత్సాహికతను, అవకాశాలను పెంపొందించేందుకు ఆరు విశ్వవిద్యాలయాల్లో రాష్ట్ర స్థాయి సదస్సులు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమానికి ప్రేరణ అని నామకరణం చేశారు. గత రెండేళ్లుగా ప్రేరణ విజయవంతగా నిర్వహించడంతో ఈ ఏడాది కూడా ఫిబ్రవరి 8 ఇందుకు సంబంధించి అనేక పోటీలు నిర్వహించనున్నట్టు ఆయన చెప్పారు. బుధవారం నాడు పాపిరెడ్డి ప్రేరణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ వీ వెంకటరమణ, ప్రొఫెసర్ హెచ్ వెంకటేశ్వర్లు, ప్రొఫెసర్ డీ చెన్నప్ప తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ కామర్స్ అసోసియేషన్ సహకారంతో దీనిని నిర్వహిస్తున్నామని, ఈ అసోసియేషన్‌లో వెయ్యిమంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు సభ్యులుగా ఉన్నారని వారు చెప్పారు. 2018లో భద్రుకా కాలేజీలో డిజిటల్ కామర్స్ అంశంపై సదస్సు నిర్వహించామని, 2019లొ అగ్రికల్చర్ మార్కెటింగ్ అంశంపై పాలమూరు వర్సిటీలో సదస్సు నిర్వహించామని వారు పేర్కొన్నారు. ప్రేరణను మూడు దశలుగా నిర్వహిస్తామని, తొలి దశలో కాలేజీ స్థాయిలో ఎంపిక ఉంటుందని, తర్వాత యూనివర్సిటీ స్థాయిలో ఉంటుందని, అనంతరం రాష్టస్థ్రాయి ఎంపిక జరుగుతుందని అన్నారు. రాష్ట్ర స్థాయి పోటీలు భద్రుకా కాలేజీలో ఫిబ్రవరి 8న జరుగుతాయని, ప్రధానంగా బిజినెస్ క్విజ్, కామర్స్ క్వెస్ట్, జస్ట్ - ఎ -మినిట్, వ్యాసరచన పోటీ, వక్తృత్వ పోటీలు ఉంటాయని వారు పేర్కొన్నారు.
'చిత్రం... ప్రేరణ పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తదితరులు