తెలంగాణ

సమర్థుడికి పీసీసీ పగ్గాలు అప్పగించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా సమర్థుడైన నేతను, అన్ని వర్గాలను కలుపుకునిపోయే నేతను నియమించాలని టీపీసీసీ సీనియర్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కోరారు. ఈ లేఖరపై సీనియర్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, వీ హనుమంతరావు, ఎస్ చంద్రశేఖర్, కోదండరెడ్డి, బీ కమలాకరరావు, జీ నిరంజన్, డాక్టర్ పీ వినయ్ కుమార్, ఏ శ్యాంమోహన్ తదితరులు సంతకాలు చేశారు. పార్టీకి విధేయత, పార్టీ సిద్ధాంతాల పట్ల నిబద్ధత, మంచి ఇమేజి, అన్ని వర్గాలను కలుపుకునే నేతను ఎంపిక చేయాలన్నారు. ఈ విషయమై పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లతో సంప్రదింపులు జరిపి వారి అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో చొరవ తీసుకుని ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత సోనియాగాంధీకే దక్కుతుందన్నారు. అనేక కారణాల వల్ల రాజకీయంగా కాంగ్రెస్ పార్టీ లబ్థి పొందలేకపోయిందన్నారు. పార్టీ కార్యకర్తలో విశ్వాసాన్ని నింపాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ, బీజేపీ నుంచి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయన్నారు. ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల తర్వాత తాను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటానని ప్రస్తుత అధ్యక్షుడు ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించేటప్పుడు అన్ని అంశాలను పరిశీలించాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ కేడర్ నిరాశతో ఉందన్నారు. పార్టీ కేడర్‌కు ఉత్సాహం ఇచ్చే నేత కావాలన్నారు.
'చిత్రం... హైదరాబాద్‌లో బుధవారం సమావేశమైన కాంగ్రెస్ సీనియర్ నాయకులు