తెలంగాణ

సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: తెలంగాణ రాష్ట్రప్రభుత్వం, డీఎస్‌సీఐ సంస్థలు ఉమ్మడిగా ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సేవలు స్వీకరించేందుకు విశేష స్పందన లభిస్తున్నట్లు సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సీఈవో డాక్టర్ శ్రీరాం బిరుదవోలు చెప్పారు. సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీకి సంబంధించి ఇంక్యుబేటర్లు, ఆక్సిలేటర్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విషయమై టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేసుకునేందుకు కంపెనీలు, స్టార్టప్ సంస్థల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రొగ్రాం వచ్చే ఫిబ్రవరి నెలలో ప్రారంభమవుతుంది. మొదటి రౌండ్ దరఖాస్తుల స్వీకరణ త్వరలో ముగుస్తుంది. సైబర్ సెక్యూరిటీ, డాటా ప్రైవసీకి సంబంధించి వినూత్న విధానాలను ఆవిష్కరించాలనుకునే వారు ఈ ప్రొగ్రాంను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సైబర్ దాడుల నుంచి ప్రొటెక్టింగ్ ఎంటర్‌ప్రైజస్‌ను కాపాడేందుకు, డాటాను పరిరక్షించుకునేందుకు ఈ ప్రొగ్రాం ఉపయోగపడుతుందన్నారు.
ప్రభుత్వ సంస్థలు, ప్రభుత్వేతర సంస్థలకు ఈ ప్రోగ్రాం ఉపయుక్తంగా ఉంటుందని ఆయన తెలిపారు.