తెలంగాణ

పౌరసత్వ నిరూపణ చట్టాల రద్దుకు పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: పౌరసత్వ నిరూపణ చట్టాల రద్దుకు పోరాటం తప్పదని సీఐటీయూ అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి ఎం సాయిబాబు పేర్కొన్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ 123 వ జయంతి సందర్భంగా నేతాజీ విగ్రహం వద్ద ఎన్‌ఆర్‌సీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం జరుగుతుందని, జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరణలు, భారత రాజ్యాంగ ప్రవేశిక ప్రతిజ్ఞ, జనవరి 30న గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహాలు , కూడళ్ల వద్ద మానవహారాలు నిర్వహిస్తామని వారు పేర్కొన్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల రీత్యా అస్సాంకే పరిమితమైన పౌరసత్వ నిరూపణ చట్టాన్ని దేశవ్యాప్తంగా అమలుకు పూనుకుందని, సీఏఏ చట్టం ప్రకారం బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ దేశాల నుండి వచ్చిన వారిలో ముస్లిం మైనార్టీలు మినహా మిగిలిన అందరికీ పౌరసత్వం ఇస్తామని చెబుతోందని, వీరిలో ఈ దేశంలో సభ్యులు సైతం ఈ పౌరసత్వం చట్టం ప్రకారం పౌరులుగా నిరూపించుకోలేకపోయారంటే ఈ చట్టం ప్రమాదం ఏ పాటిదో అర్ధమవుతోందని అన్నారు.