తెలంగాణ

పారిశ్రామిక అభివృద్ధితోనే ఆర్థిక సంక్షోభానికి చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం పోవాలంటే పారిశ్రామిక అధివృద్ధి వేగవంతంగా జరగాలని రాష్ట్ర భారతీయ మజ్దూర్ సంఘం అభిప్రాయపడింది. భారతీయ మజ్దూర్ సంఘం 19వ జాతీయ మహాసభలు హైదరాబాద్‌లో తొలిసారి జరిగాయని సంఘం ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర బీఎంఎస్ అధ్యక్షుడు వర్మ మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా కార్మిక రంగంలో 61 సంవత్సరాలుగా పని చేస్తోందని ఆయన గుర్తు చేశారు. బీఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి విరిజేష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ 2020 ఏప్రిల్ 17 నుంచి 19 వరకూ హైదరాబాద్‌లో బీఎంఎస్ జాతీయ మహాసభలు జరుగుతాయన్నారు. ఈ మహాసభలకు ముఖ్యఅతిథిగా ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వస్తున్నట్లు చెప్పారు. దేశ వ్యాప్తంగా రెండున్నర్ర వేలమంది ప్రతినిధులు మహాసభలకు హాజరు అవుతారని చెప్పారు. సార్క్ దేశాల నుంచి ఆయా దేశాల కార్మిక నేతలు, దేశంలో ఉన్న వివిధ కార్మిక సంఘాల నేతలు తరలివస్తున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా కార్మికులకు కనీస వేతనాలు ఒకే విధంగా ఉండాలని, కాంట్రాక్టు లేబర్‌ని రెగ్యులర్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమానికి కేంద్రం పెద్దఎత్తున నిధులు విడుదల చేయాలన్నారు. మజ్దూర్ సంఘం దేశంలో నాలుగు కోట్ల మంది కార్మికుల సభ్యత్వం కలిగి ఉందన్నారు. కార్మిక సంఘంలో పేరుకుపోయిన సమస్యలను తక్షణం పరిష్కరించాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. జాతీయ ఉపాధ్యక్షుడు పల్లేశం, సంఘటన కార్యదర్శి సురేంద్రన్ మాట్లాడుతూ దేశ నలుమూలల నుంచి 46 రంగాల కార్మికరంగ ప్రతినిధులు మహాసభలకు వస్తున్నారన్నారు.
దేశ వ్యాప్తంగా పబ్లిక్ రంగసంస్థల్లో పెట్టుబడి ఉపసంహరణ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలకు అన్ని రంగాల ఉద్యోగ, కార్మికులు, ప్రభుత్వం, ప్రజలు సహకరించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిశంకర్ పిలుపు ఇచ్చారు.