తెలంగాణ

మెజారిటీ స్థానాలు మావే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 నగర పాలక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హవా కొట్టొచ్చినట్లు కనపడిందని, మెజారిటీ స్థానా ల్లో తమ పార్టీ జెండా ఎగరడం ఖాయమని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తమకు వచ్చిన సమాచారం ప్రకారం అన్ని మున్సిపాలిటీల్లో దళితులు, బలహీనవర్గాలు, మైనారిటీలు, ఇతర వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున తమకు ఓట్లు వేసినట్లు భావిస్తున్నామని కాంగ్రెస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి బుధవారం ఇక్కడ మాట్లాడుతూ, మున్సిపాలిటీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపరుచుకునేందుకు టీఆర్‌ఎస్ అన్ని రకాల ఎత్తుగడలకు పాల్పడిందన్నారు. అయినా ఓట ర్లు మాత్రం ఎటువంటి గిమ్మిక్కులకు లొంగకుండా కాంగ్రెస్‌కు నిర్భయంగా ఓటు వేశారన్నారు. చాలాచోట్ల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలపై టీఆర్‌ఎస్, ఎంఐఎం కార్యకర్తలు, నేతలు దాడులకు దిగారన్నారు. బోడుప్పల్, మేడ్చల్ ఇంకా పలుచోట్ల తమ పార్టీ నేతలపై అధికార పార్టీ నేతలు దౌర్జన్యానికి దిగినట్లు చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రజలు తమవైపు మొగ్గుచూపలేదని అక్కసుతో దాడులకు దిగినట్లు అర్థమవుతుందన్నారు. ఈ నెల 25న ఎన్నికల ఫలితాలు టీఆర్‌ఎస్‌కు షాక్ ఇవ్వడం తథ్యమన్నారు. మహిళలు, యువతీ యువకులు ఉత్సాహంగా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్నా రు. మున్సిపాలిటీల అభివృద్ధి పట్ల రాష్ట్ర ప్రభు త్వం వహించిన నిర్లక్ష్యం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. కౌంటింగ్ రోజు అధికార పార్టీ ఎటువంటి అవకతవకలకు పా ల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని ఆయన కాంగ్రెస్ కార్యకర్తలను కోరారు.
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో 50 శాతానికి పైగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవశం చేసుకోబోతోందన్నారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు టీఆర్‌ఎస్ వేసిన పాచిక పారలేదన్నారు. మున్సిపాలిటల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అధికార పార్టీ విచ్చలవిడిగా మద్యం, డబ్బులు, బహుమతులు పంచి ఓట్లు కొనుగోలు
చేయాలని కుట్రలు పన్నిందని చెప్పారు. కానీ ఈ కుట్రలను ఓటర్లు ఎదిరించి పోలింగ్ బూత్‌లకు వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఊహించిన దాని కంటే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటుందనే ఆత్మవిశ్వాసంతో ఉన్నట్లు ఏఐసీసీ ప్రతినిధి జీ నిరంజన్ తెలిపారు. ఎన్నికల సంఘం, రాష్ట్రప్రభుత్వం ఎన్ని ఆటంకాలు కలిగించినా ప్రజలు తమ పక్షమే ఉన్నారన్నారు.
'చిత్రం... కోదాడలో ఓటు వేసిన పీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి దంపతులు