తెలంగాణ

మున్సిపోల్స్‌లోనూ గులాబీయే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: శాసనసభ, స్థానిక, పరిషత్ ఎన్నికల మాదిరిగా మున్సిపల్ ఎన్నికల్లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి ఘన విజయం సాధించబోతుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, 90 శాతం స్థానాలను టీఆర్‌ఎస్సే గెలుచుకోబోతుందన్నారు. పోలింగ్ సరళిని బట్టి టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించబోతున్నట్టు తెలుస్తోందన్నా రు. గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలుకొని పరిషత్ ఎన్నికల వరకు, తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ
టీఆర్‌ఎస్ పార్టీదే విజయమన్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాక ప్రతిపక్షాలకు ఆశాభంగం తప్పదని ఆయన అన్నారు. ప్రతి ఎన్నికలో టీఆర్‌ఎస్‌కే ఓటర్లు అప్రతిహత విజయాన్ని అందిస్తున్నారని పల్లా వివరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఎజెండాకు మంత్రి కేటీఆర్ పనితీరుకు లభించబోతున్న విజయమిదన్నారు. ప్రతిపక్షాలు అభ్యర్థులను ఎంపిక చేసుకోవడంలోనే విఫలమయ్యాయని ఆయన అన్నారు. పట్టణ, నగర ప్రాంతాల ఓటర్లు టీఆర్‌ఎస్ పట్ల కనబరిచిన అచంచల విశ్వాసానికి పార్టీ తరఫున ధన్యవాదాలన్నారు. పార్టీ అభ్యర్థుల విజయం కోసం రేయింబవళ్లు శ్రమించిన పార్టీ శ్రేణులకు పల్లా కృతజ్ఞతలు తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా టీఆర్‌ఎస్సే విజయం సాధిస్తుందన్న ధీమాను పల్లా రాజేశ్వర్‌రెడ్డి వ్యక్తం చేశారు.

'చిత్రం... హైదరాబాద్‌లో బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి