తెలంగాణ

పుర పోలింగ్ 71.37%

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 22: మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో 71.37 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓటర్లు 49,74,598 ఉండగా, 35,50,483 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ఉదయం మందకొడిగా ప్రారంభమైనప్పటికీ, ఆ తర్వాత పుంజుకుంది. ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల మధ్య అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత మళ్లీ మందకొడిగా కొనసాగింది. ఓటర్లలో పురుషులు 24,89,698 మంది, మహిళలు 24,84,587 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. హిజ్రాలు 313 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్ పత్రాలను ఓటు వేసేందుకు వినియోగించి, ఈ పత్రాలను బ్యాలెట్ బాక్సుల్లో వేయించారు. బ్యాలెట్ పత్రాలను తెలుపు రంగులో ముద్రించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో పోలింగ్ సిబ్బందితో పాటు రాజకీయ పార్టీల తరఫున పోలింగ్ ఏజంట్లు కూర్చున్నారు. దొంగఓట్లకు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు. పోలింగ్ జరుగుతున్న తీరును చాలాచోట్ల వీడియో ద్వారా రికార్డు చేశారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంతో పాటు జిల్లా ఎన్నికల అధికారులైన జిల్లా కలెక్టర్లు తమ కార్యాలయాల్లో కూర్చుని ఓట్ల సరళి పరిశీలించేందుకు వెబ్ క్యాస్టింగ్‌ను 2,406 కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. చాలావరకు సాయంత్రం ఐదు గంటలకే
పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్లనే మరో అరగంట పాటు పోలింగ్ కొనసాగింది.
తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో సరాసరిన 57 శాతం ఓట్లు పోలయ్యాయి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్‌లో అత్యధిక శాతం ఓట్లు పోలయ్యాయి. రామగుండంలో 67.66 శాతం, బోడుప్పల్‌లో 64.24 శాతం, పీర్జాదిగూడలో 64.31 శాతం, జవహర్‌నగర్‌లో 50.02 శాతం, నిజాంపేటలో 39.66 శాతం, నిజామాబాద్‌లో 61.12 శాతం, బండ్లగూడ జాగీర్‌లో 56.06 శాతం, మీర్‌పేటలో 51.78 శాతం, బడంగ్‌పేట మున్సిపల్ కార్పొరేషన్‌లో 63.87 శాతం ఓట్లు పోలయ్యాయి.
120 మున్సిపాలిటీల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మున్సిపాలిటీలకు సంబంధించి అత్యధికంగా పోచంపల్లిలో 95.13 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత చండూరులో 91.33 శాతం, యాదగిరిగుట్టలో 90.33 శాతం, చౌటుప్పల్‌లో 90.61 శాతం పోలయ్యాయి. అతితక్కువగా నమోదైన వాటిలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్
రికార్డయింది. ఇక్కడ కేవలం 39.65 శాతం ఓట్లు పోలయ్యాయి. మణికొండలో 41.65 శాతం, జల్‌పల్లిలో 46.91 శాతం ఓట్లు పోలయ్యాయి.
బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలతో ముగిసింది. కొన్నిచోట్ల ఐదు గంటలకు క్యూలైన్‌లో నిలబడ్డ ఓటర్లంతా తమ ఓటుహక్కు వినియోగించుకునే వరకు పోలింగ్ కొనసాగించారు. పోలింగ్ నిర్వహణలో 45 వేల మంది సిబ్బంది పాల్గొన్నారు. మొత్తం 7,961 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా, బుధవారం అర్ధరాత్రి వరకు అన్ని పోలింగ్ కేంద్రాల నుండి బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించారు. ఈ నెల 25న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.
ముగిసిన కరీంనగర్ ప్రచారం
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ప్రచారం బుధవారం సాయంత్రం ముగిసింది. అక్కడ ఈ నెల 24న పోలింగ్ జరుగుతుంది. కోర్టు కేసు వల్ల కరీంనగర్‌లో పోలింగ్ కాస్త రెండు రోజులు ఆలస్యంగా జరుగుతోంది.
హిజ్రాలది రికార్డ్
రాష్ట్రంలో హిజ్రా ఓటర్లు మొత్తం 357 మంది ఉండగా, వీరిలో 313 మంది తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. అంటే 87.67 శాతం ఓట్లు పోలయ్యాయని స్పష్టమవుతోంది. సామాన్య ఓటర్లు 71.37 శాతం తమ ఓటుహక్కును వినియోగించుకోగా, సామాన్య ఓటర్లకంటే హిజ్రాలే బాధ్యతగా ఓట్లు వేసినట్టు లెక్కల వల్ల స్పష్టమవుతోంది.

'చిత్రం... సూర్యాపేటలో ఓటేసిన మంత్రి జగదీశ్‌రెడ్డి దంపతులు