తెలంగాణ

పరిపూర్ణం.. ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 మున్సిపల్ కార్పొరేషన్లలో బుధవారం పోలింగ్ ప్రశాంతంగా పూర్తయినట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి ఎం. అశోక్ కుమార్ తెలిపారు. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించామని, సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగిందని చెప్పారు. పోలింగ్ పరిపూర్ణంగా, చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా జరిగిందని ఆయన స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎస్‌పీలు, పోలీస్ కమిషనర్లు, ఎన్నికల అధికారులు, మున్సిపల్ సిబ్బంది కొంత కాలంగా నిర్విరామంగా కృషి చేశారన్నారు. దాదాపు నెల రోజుల నుండి రాత్రనకా, పగలనకా తాము చేసిన కృషి సత్ఫలితాలను ఇచ్చిందన్నారు. మున్సిపాలిటీల్లో 2,647 కేంద్రాల్లో, మున్సిపల్ కార్పొరేషన్లలో 324 కేంద్రాల్లో పోలింగ్ జరిగిందని వివరించారు. రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా సహకారం అందించాయన్నారు. పోలింగ్‌తో ప్రధానమైన ఒక అంకం ముగిసిందని, ఈ నెల 25న రెండో అంకమైన కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశామని అశోక్ కుమార్ వివరించారు.

'చిత్రం... మేడ్చల్ జిల్లా కొంపల్లిలో యాప్ ద్వారా ఓటరు ఐడీని చెక్ చేస్తున్న దృశ్యం