తెలంగాణ

కేటీఆర్‌తో.. బహిరంగ చర్చకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చౌటుప్పల్, జనవరి 20: రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చింది, ఆరేళ్ల పాలనలో పంచాయతీలు, మున్సిపాల్టీల అభివృద్ధికి రాష్ట్రం ఎన్ని నిధులు కేటాయంచిందో చర్చించేందుకు కేటీఆర్ బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెం సమీపంలోని విలేజ్ ఆహారం వద్ద సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక్క పైసా ఇవ్వడం లేదని చెప్పడంలో నిజం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామపంచాయతీలు, మున్సిపాల్టీలు నిర్వీర్యమయ్యాయన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే ప్రభుత్వాన్ని నెట్టుకువస్తున్నారన్నారు. గత పదేళ్ల పాలనలో రాష్ట్రానికి వచ్చిన నిధులెన్ని, మోదీ ఐదున్నరేళ్ల పాలనలో ఇచ్చిందెంత అన్న విషయాలను చర్చించేందుకు సిద్ధంగా ఉండాలని సవాలు చేశారు. ఉత్తర ప్రగల్భాలు పలకడం, మభ్యపు మాటలు చెప్పి ప్రజలను మోసం చేయడంలో తండ్రీ కొడుకులు అందవేసిన వారన్నారు. గారడీ మాటలు చెప్పడం తమకు చేతకాదన్నారు. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నామని చెబుతున్న కేటీఆర్, కేసీఆర్‌లు ఇస్తున్నది కిలోకు రూపాయి మాత్రమేనన్నారు. కేంద్ర ప్రభుత్వమే కిలోకు రూ.28 చెల్లిస్తుందని చెప్పారు. ఒక్క రూపాయి ఇచ్చి మొత్తం తామే ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎంఐఎం ముసుగులో పడిపోయి రాష్ట్రంలో బీజేపీ ఎక్కడుందని కేటీఆర్ అనడం సిగ్గుచేటన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో అన్నిసీట్లు మావేనని చెప్పిన కేటీఆర్‌కు ప్రజలు గూబగుయ్యిమనిపించారన్నారు. సొంత సోదరిని గెలిపించుకోలేని అసమర్థుడు కేటీఆర్ అని విమర్శించారు. మళ్లీ అదే కూత కూస్తున్న కేటీఆర్‌కు మున్సిపల్ ఎన్నికల్లో చావుదెబ్బ కొడతారని పేర్కొన్నారు. ఆరేళ్లలో అభివృద్ధి చేస్తే, ప్రజల మీద విశ్వాసం ఉంటే డబ్బులు గుప్పి అభ్యర్థులను గెలిపించుకోవలసిన పరిస్థితులు ఎందుకు వచ్చాయని విమర్శించారు. అభివృద్ధిని చూసి ప్రజలే ఓట్లు వేస్తారన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో రోజురోజుకు విశ్వాసం పెరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ మున్సిపాల్టీలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగిడి మనోహర్‌రెడ్డి, దూడల బిక్షంగౌడ్, దోనూరి వీరారెడ్డి తదితరులున్నారు.
'చిత్రం...విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి