తెలంగాణ

ఈ నెలాఖరులోగా పీఆర్సీ ప్రకటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భూపాలపల్లి, జనవరి 20: ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్‌తో ఈ నెలాఖరులోగా పీఆర్సీని ప్రకటించి జూలై 2018 నుండి వర్తింపజేయాలని టీఎన్జీవో సంఘం కేంద్ర అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం భూపాలపల్లి పట్టణంలోని ప్రగతి భవన్‌లో టీఎన్జీవో జయశంకర్ భూపాలపల్లి అధ్యక్షుడు బూరుగు రవి అధ్యక్షతన నిర్వహించిన టీఎన్జీవో 2020 డైరీ ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఉద్యోగుల సమస్యల సాధనలో ప్రభుత్వ హామీ మేరకే తాము వేచిచూసే ధోరణిలో ఇంతవరకు ఉన్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, లేదంటే తెలంగాణ ఎన్జీవో సంఘానికి పోరాటాలు చేయడం కొత్తేమీ కాదన్నారు. పీఆర్సీ ప్రకటించడం ఆలస్యం పట్ల ప్రభుత్వ తీరుపై క్షేత్రస్థాయిలో ఉద్యోగులలో అసహనం ఉందని, ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదని, అందరూ సమష్టిగా పనిచేసినప్పుడే ముఖ్యమంత్రి కలలు కనే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. పీఆర్సీ నివేదిక ఇవ్వడంలో కమిటీ జాప్యం చేయడం ఉద్యోగులకు శాపంగా మారిందని, ఉద్యోగుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి 16 అంశాల డిమాండ్లను తీసుకెళ్లామని, వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత గౌరవ ముఖ్యమంత్రిదేనని టీఈ జేఏసీ వరంగల్ ఛైర్మన్ పరిటాల సుబ్బారావు అన్నారు. ప్రతి ఉద్యోగికి కనీస వేతనం రూ.24 వేలు ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, నూతనంగా ఏర్పడిన జిల్లా కేంద్రాలలో సరైన రీతిలో క్యాడర్ స్ట్రెంత్‌ను మంజూరు చేయాలని టీఎన్జీవో కేంద్ర సంఘం సహ అధ్యక్షుడు కుమారి రేచల్ అన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అమలు పరిచేది క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులదేనని, పేద ప్రజలకు మెరుగైన సేవలు చేసి ఉద్యోగులు ఆదర్శంగా నిలుస్తున్నారని, వారి సమస్యలను పరిష్కారానికై ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని జాయింట్ కలెక్టర్ స్వర్ణలత అన్నారు. సీఎం కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఉద్యోగులతో చర్చించి సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో ఉమ్మడి జిల్లాల కో ఆర్డినేటర్ శీల రాజేష్‌కుమార్ అన్నారు. భూపాలపల్లి జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు 20 శాతం ఇంటి అద్దె అలవెన్స్‌ను, బ్యాడ్ క్లైమెట్ అలవెన్స్‌ను, ఉద్యోగులకు నివాస స్థలాలను కేటాయించాలని, అన్ని కార్యాలయాల్లో మహిళలకు ప్రత్యేక రెస్ట్ రూంను ఏర్పాటు చేయాలని జిల్లా అధ్యక్షుడు బూరుగు రవి అన్నారు. ఈ సమావేశంలో టీఎన్జీవో జిల్లా నాయకులు హరికృష్ణ, జిల్లా కార్యదర్శి, కేంద్ర సంఘం నాయకులు ఎస్.శ్యాంసుందర్, కత్తి రమేష్, భూక్య రామునాయక్, ఉమ్మడి జిల్లాల రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు జి.రాజ్‌కుమార్, ఐసీడీఎస్ ఉద్యోగుల జిల్లా అధ్యక్షులు సరోజ, టీఎన్జీవో జిల్లా నాయకులు గోమఠం శ్రీనాధ్, వీరాంజనేయులు, దశరథరామారావు, రవీందర్‌రావు, యాదగిరి, శ్రవణ్‌రెడ్డి, మధుసూదన్, రాంబాబు, సత్యనారాయణ, సలీంరాజ, అన్వర్‌బేగ్, హరి, నాగేశ్వర్‌రావు, మంగతాయి, జ్ఞానేశ్వర్, మధుసూదన్‌రాజ్ పాల్గొన్నారు.
'చిత్రం...టీఎన్జీవో 2020 డైరీ ఆవిష్కరణ సభలో మాట్లాడుతున్న రాష్ట్ర అధ్యక్షుడు కారం రవీందర్ రెడ్డి