తెలంగాణ

అభివృద్ధి చేస్తా... మీ వెంటే ఉంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేరేడుచర్ల, జనవరి 20: ఈప్రాంతాన్ని అభివృద్ధి చేశానని మీవెంటే ఉంటూ మరింత అభివృద్ధి చేస్తానని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్ధులను గెలిపించాలని టీపీసీసీ అధ్యక్షుడు, నల్లగొండ ఎంపీ నలమాద ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆయన సోమవారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్లలోని పలు వార్డుల్లో మున్సిపల్ ఎన్నికల రోడ్‌షోలో మాట్లాడుతూ నిరంతరం ప్రజాజీవనంలో ఉంటూ నిర్విరామంగా ప్రజాసేవ చేసే కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్ధులను గెలిపించి నూతనంగా ఏర్పడిన నేరేడుచర్ల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. నేరేడుచర్లలో గృహాలు మంజూరు చేసి సీసీ రహదారులు, మురుగుకాల్వల నిర్మాణం చేసింది తామేనన్నారు. నేరుగా కేంద్ర నిధులు తెచ్చి మున్సిపాలిటీల్లో అన్ని వసతులు, సౌకర్యాలు కలిగే విధంగా అభివృద్ధి పనులు చేపడ్తామన్నారు. ఓటర్లు అధికార పార్టీ ఇచ్చే మద్యం, డబ్బును తీసుకుని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల్లో డబ్బులు పంచుతూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందన్నారు. పౌరసత్వ బిల్లుకు మద్దతు తెలిపిన టీఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేస్తే బీజీపీకి ఓటు వేసినట్టేనని ముస్లింలకు చెప్పారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్ధి ప్రకాశ్ గెలుపుకోసం శాయశక్తులా కృషిచేస్తామన్నారు. రాష్ట్రం టీఆర్‌ఎస్ పార్టీ జాగీరు కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను బెదిరించినా, వేధించినా సహించమని, ప్రభుత్వానికి సరైన సమయంలో తగిన గుణపాఠం చెప్తామన్నారు.
కార్యక్రమంలో మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు కొణతం చినవెంకట్‌రెడ్డి, నూకల సందీప్‌రెడ్డి, పాలకీడు ఎంపీపీ భూక్యా గోపాల్, జడ్పీటీసీ మాలోతు మోతీలాల్, మాజీ ఎంపీపీలు పారెపల్లి శేఖర్‌రావు, పైడిమర్రి రంగనాధ్, టీడీపీ జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షుడు పాల్వాయి రమేష్, కాంగ్రెస్ నాయకులు అల్లం ప్రభాకర్‌రెడ్డి, రాచకొండ అజయ్, వల్లంశెట్ల లచ్చయ్య, జితేందర్‌రెడ్డి, బచ్చలకూరి మట్టయ్య, తాళ్ల రామకృష్ణారెడ్డి, అంజంరెడ్డి, ఇనపాల పిచ్చిరెడ్డి, పాండునాయక్, కృష్ణారెడ్డి, నాగిరెడ్డి, సీపీఎం నాయకులు కె.నగేష్, మర్రి నాగేశ్వర్‌రావు, ఎడ్ల సైదులు, మీనయ్య, కాంగ్రెస్, మిత్రపక్షాల అభ్యర్ధులు పాల్గొన్నారు.
'చిత్రం...రోడ్‌షోలో మాట్లాడుతున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి