తెలంగాణ

పోలింగ్ ముగిసే వరకు జాగ్రత్తగా ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు పార్టీ శ్రేణులు, నాయకులు అప్రమత్తంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసినప్పటికీ నిశ్శబ్దంగా ప్రచారం చేసుకునే అవకాశం ఉందన్నారు. పట్టణ ప్రాంతాల పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్ వ్యతిరేక ఓటర్లపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, గ్రామీణ ప్రాంత పార్టీ శ్రేణులు పట్టణాలు, నగరాల్లోని తమ బంధువులను కాంగ్రెస్‌కు ఓటు వేసే విధంగా చైతన్యపర్చాలన్నారు. పార్టీ శ్రేణులు ప్రధానంగా రెండు సామాజిక వర్గాలపై దృష్టి సారించి వారి ఓట్లను కాంగ్రెస్‌కు మళ్లించాలన్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని అమలు చేసేది లేదని అనేక రాష్ట్రాలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ తెలంగాణలో మాత్రం ఈ చట్టంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయాన్ని మైనార్టీ ఓటర్ల దృష్టికి తీసుకెళ్లి వారిని కాంగ్రెస్‌కు ఓటు వేసేలా చూడాలన్నారు. అలాగే, రైతుబంధు, పంట రుణ మాఫీ, నిరుద్యోగ భృతి అమలు చేయకపోవడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని కాంగ్రెస్‌కు అనుకూల ఓట్లు మలుచుకోవాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్టి సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించే పట్టణాల్లో పారదర్శక,
అవినీతిరహిత పాలనను అందిస్తామని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.
'చిత్రం... తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి