తెలంగాణ

ప్రగతికి పట్టం కట్టండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రజలకు వివరించిన ప్రగతి ఎజెండాకు పట్టం కట్టాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తుందన్న విశ్వాసాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. వరల్ట్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి దావోస్ వెళ్లిన కేటీఆర్ సోమవారం అక్కడి నుంచే పార్టీ సీనియర్ నాయకులతో మున్సిపల్ ఎన్నికలపై సమీక్ష నిర్వహించారు. ప్రతిపక్షాల దూషణలు, అసత్య ప్రచారాలకు భిన్నంగా మున్సిపల్ ఎన్నికల్లో తమను గెలిపిస్తే ఏం చేస్తామో అదే టీఆర్‌ఎస్ వివరించిందని కేటీఆర్ అన్నారు. ప్రచార పర్వంలో ప్రతిపక్షాలకు అందనంత ముందంజలో టీఆర్‌ఎస్ దూసుకుపోయిందన్నారు. ప్రజల నుంచి కూడా తమకు అత్యంత సానుకూల స్పందన వ్యక్తమైందని అన్నారు. టీఆర్‌ఎస్ ఘన విజయం సాధించే దిశగా పార్టీ ఎన్నికల ప్రచారం కొనసాగిందన్నారు. ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, స్థానిక పట్టణాలకు, వార్డులకు చేయనున్న కార్యక్రమాలను తన ఎజెండాగా ప్రకటించి ముందుకుపోయిందని అన్నారు. అయితే ప్రతిపక్షాలు మాత్రం కేవలం దుష్ప్రచారం, దూషణలు,
అసత్య ఆరోపణలకే పరిమితమైందని అన్నారు. అభివృద్ధినే తన ఎజెండాగా ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పటివరకు ప్రతి ఎన్నికల్లో ప్రజల నుంచి లభించిన సానుకూల స్పందన, ఆశీర్వాదం, విజయాల మాదిరే ఈ ఎన్నికల్లోనూ ఘన విజయం వరిస్తుందన్న ఆశాభావాన్ని కేటీఆర్ వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల కంటే ఎంతో ముందంజలో ఉన్నప్పటికీ ఈ రెండు రోజుల పాటు పార్టీ శ్రేణులు మరింత ఉత్సాహంగా పని చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులు ఓటింగ్ ప్రక్రియకు సంబంధించిన ఏర్పాట్లలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల పార్టీ బాధ్యులు, పార్టీ సీనియర్ నాయకులు, మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీలు, ప్రధాన కార్యదర్శులతో కేటీఆర్ స్వయంగా ఫోన్లో మాట్లాడారు. బూత్‌ల వారీగా జాబితాలు తయారు చేసి స్థానిక ఇన్‌చార్జిలకు అందజేయాల్సిందిగా కేటీఆర్ ఆదేశించారు. ఎన్నికల తర్వాత జరిగే చైర్‌పర్సన్స్ ఎన్నికకు సంబంధించి కూడా ఇప్పటి నుంచే ప్రణాళికలను సిద్ధం చేసుకోవాల్సిందిగా సూచించారు. తెలంగాణ భవన్ నుంచి కేంద్ర ఎన్నికల సమన్వయ బృందం ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తెప్పించుకోవాలని పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని కేటీఆర్ ఆదేశించారు.

'చిత్రం... టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు