తెలంగాణ

మున్సి‘పోల్స్’లో టీఆర్‌ఎస్‌కే మద్దతు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: రాష్ట్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ తెరాసకు మద్దత్తు ఇవ్వాలని సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నిర్ణయించారు. ఈమేరకు ఆదివారం తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలసి వారు తమ మద్దత్తును ప్రకటించారు. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగుల సంఘం కేంద్ర కమిటీ గౌరవ అధ్యక్షుడు ఆరేపల్లి రాజేందర్ మాట్లాడుతూ సింగరేణి ఉద్యోగుల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అందుతున్నాయని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించడానకి సొంత ఖర్చులు భరించి ఎన్నికల ప్రచారాన్ని చేపడతామని వారు స్పష్టం చేశారు. సింగరేణి ప్రాంత ఏరియాలో ఉన్న అన్ని మున్సిపాల్టీల్లో దాదాపు లక్ష మంది ఎస్సీ,ఎస్టీ ఉద్యోగులు ఉన్నారని వారు గుర్తు చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపంచడానికి కృషి చేస్తామన్నారు. బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, గోదావరిఖని, భూపాల్‌పల్లి, కొత్తగూడెం, పినపాక, ఇల్లందు, సత్తుపల్లి, మున్సిపాల్టీల్లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీఎస్టీ ఉద్యోగులు సరైన నిర్ణయం తీసుకోవడం పట్ల ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గోళ్ల రమేష్, ప్రధాన కార్యదర్శి ఆంతోటి నాగేశ్వర్‌రావు, ఉపాధ్యక్షుడు బాణోతు కర్ణ, మల్లేష్, వెంకటేశ్వర్లు, పద్మారావు, రమేష్, కుమార్ పాల్గొన్నారు.
'చిత్రం...మున్సిపల్ ఎన్నికల్లో తెరాసకు మద్దతు ఇస్తామంటూ ప్రణాళికా సంఘం
రాష్ట్ర వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను కలసిన సింగరేణి ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు