తెలంగాణ

డబ్బుతో గెలవాలని చూస్తున్న టీఆర్‌ఎస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 19: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం వల్లనే అభివృద్ధి సాధ్యమని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్ పరిసరాల్లోని అనేక మున్సిపాలటీల్లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పార్టీ డబ్బులతో గెలవాలని చూస్తోందని, కేసీఆర్ ఎత్తులను చిత్తు చేయాలని ప్రజలను కోరారు. తెలంగాణను కేసీఆర్, ఒవైసీ కుటుంబాల నుంచి విముక్తి చేయించాలన్నారు. తెలంగాణ ప్రాంతం బీజేపీ పాలనలోనే అభివృద్ధి సాధిస్తుందన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మంది ఒవైసీలు అడ్డుకున్నా, బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఓట్లు అడగడానికి వచ్చే టీఆర్‌ఎస్ అభ్యర్థులను గత ఆరేళ్లలో మీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీయాలన్నారు. రాష్ట్రం కుటుంబ పాలనతో నలిగిపోతోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి మందగించిందన్నారు. నిరంతరం అభివృద్ధి కావాలంటే బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. దళితులకు మూడు ఎకరాల భూమి ఇస్తామన్న హామీని నిలబెట్టుకోలేకపోయారన్నారు. పొదుపు సంఘాల రుణాలు ఏమయ్యాయన్నారు. యూపీఏ పదేళ్ల పాలనలో తెలంగాణకు కేంద్రం నుంచి నిధులు రాలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోసం చేసిందన్నారు. అదే గత ఆరేళ్లలో కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం నుంచి ఇతోధికంగా నిధులు వచ్చాయన్నారు. ఈ విషయమై చర్చకు సిద్ధమని అనేకసార్లు తాను టీఆర్‌ఎస్ నేతలకు తెలియచేశానన్నారు. మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన, సమగ్రాభివృద్ధిని, ప్రజారోగ్యం, చక్కటి రోడ్లు, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించాలనే కృత నిశ్చయంతో బీజేపీ ఉందన్నారు.
'చిత్రం...మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి