తెలంగాణ

నేటితో ‘పుర’ ప్రచారం సరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా గత వా రం పదిరోజుల నుండి ముమ్మరంగా కొనసాగిన మున్సిపోల్స్ ప్రచారం సోమవారం సాయంత్రం ముగియనుంది. ఈనెల 22న ఉదయం ఏడు గంటలకే పోలింగ్ ప్రారంభం అవుతుండడం వల్ల 36 గంటల ముందే ప్రచారం ముగించాల్సి ఉంటుంది. అందువల్ల సోమవారం సాయంత్రమే రాజకీయ పార్టీలు, అభ్యర్థులు తమ ప్రచారాన్ని నిలిపివేయాల్సి ఉంది. కాగా, పోలింగ్ నిర్వహణకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి ఏర్పాట్ల తుది వివరాలపై ఎప్పటికప్పడు జిల్లా కలెక్టర్లతో చర్చిస్తున్నారు. ఎన్నికల కమిషన్ జారీ చేసిన ఆదేశాలకు అనుగుణంగా 120 మున్సిపాలిటీలు, తొమ్మిది కార్పొరేన్లలో ఈ నెల 22న పోలింగ్ నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు జరిగాయి. ఒకవైపు ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డి, మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, ఇంకోవైపు పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి జిల్లా యంత్రాంగాలతో ఎప్పటికప్పుడు సంప్రదిస్తూనే ఉన్నారు. మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలో ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే తమకు తెలియచేయాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలావుండగా, రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో టగ్ ఆఫ్ వార్ కొనసాగుతోంది. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఉంది. టీఆర్‌ఎస్ అన్ని స్థానాలకు పోటీ పడుతుండగా, బీజేపీ, కాంగ్రెస్ 95 శాతం స్థానాల్లో పోటీ లో ఉన్నాయి. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగుస్తుండడంతో అన్ని పార్టీలు కూడా తమ శాయశక్తులా ప్రచారం కొనసాగిస్తున్నాయి. ఈ నెల 22న పోలింగ్ జరుగుతుండడంతో ప్రచారానికి లభించిన కొద్ది సమయాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను టీఆర్‌ఎస్ నేతలు ప్రధాన ప్రచార ఆయుధంగా వాడుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దగా ప్రచారంలో పాల్గొనకుండా, ప్రచార బాధ్యతలను తన కుమారుడు, ఐటీ శాఖ మంత్రి కే. తారకరామారావుకు అప్పగించారు. దాంతో కేటీఆర్ ఫకడ్బందీ వ్యూహంతో ముందు కు వెళుతున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీ లు, ఎమ్మెల్యేలను, పట్టణాల్లోని మాజీ నేతలను ప్రచారం కోసం పూర్తిగా వినియోగించుకుంటున్నారు. ఆయా జిల్లాల్లోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో విజయాన్ని మంత్రుల భుజస్కంధాలపై పెట్టడంతో మం త్రులకు ఇదొక పరీక్షా సమయంగా మారింది. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ మెజారిటీ స్థానాల్లో విజయదుందుభి మోగించినప్పటికీ, పట్టణ ప్రాంతాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుగుర్రాలకే టికెట్లు ఇచ్చి రంగంలోకి దించిన టీఆర్‌ఎస్ తన సర్వశక్తులను విజయం కోసం వినియోగిస్తోంది.
ఇక బీజేపీ నేతలు ప్రధానంగా కేం ద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాన్ని ప్రధానంగా తమ అస్త్రాలుగా వాడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని ఫోకస్ చేస్తూ, బీజేపీ విజయం సాధించాల్సిన అవసరం ఏమిటో వివరిస్తున్నారు. పరిపాలనలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందంటూ ప్రచారం చేస్తున్నా రు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలం ఉందని ఆ పార్టీ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. అదే తమ విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నారు.
అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా తన వంతు ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి తదితరులు ప్రచారంలో తాము చేసే కార్యక్రమాలేమిటో చెప్పడం కంటే
టీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శనాస్త్రాలను ప్రధానంగా ఎక్కుపెట్టారు. ఈ పరిస్థితిలో చాలా వార్డుల్లో త్రిముఖ పోటీ ఉంటోంది. ఇతర పార్టీలు కూడా రంగంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.