తెలంగాణ

కేంద్రం రాష్ట్రానికి ఏ సహాయం చేయలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఒరింగిందేమీ లేదని, ఎటువంటి ఆర్థిక సాయం, అభివృద్ధికి నిధులు రాలేదని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ ఆర్భాటంతో కూడిన ప్రకటనలను జనం నమ్మరన్నారు. కేంద్రం సహాయంపై తాము బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. శనివారం ఆయన ఇక్కడ తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం బాగా జరుగుతోందని, ప్రజలు గులాబీ పార్టీ వైపే ఉన్నారన్నారు. అధికారంలో ఉన్నామనుకుని పీసీసీ చీఫ్ విజన్ డాక్యుమెంట్ విడుదల చేసినట్లు ఉన్నారన్నారు. పల్లె ప్రగతికి మంచి స్పందన వచ్చిందన్నాను. మున్సిపల్ ఎన్నికల తర్వాత పట్టణ ప్రగతిని చేపడుతామన్నారు. టీఆర్‌ఎస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు పట్టం కడితే పట్టణాలు అభివృద్ధి చెందుతాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు చెప్పుకోవడానికి ఏమీ లేవన్నారు. తాండూరు మున్సిపాలిటీని ఎంఐఎంకు ఇచ్చినట్లు సోషల్ మీడియాలోల ప్రచారం చేస్తున్నారన్నారు. తాండూరురలో తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంఐఎంతో మాటు ఎటువంటి పొత్తులేదన్నారు. ఎంఐఎం పోటీ చేసే చోట బీజేపీ ఎందుకు పోటీ చేయడం లేదన్నారు. మీరు ఏమైనా లోపాయికారి ఒప్పందం చేసుకున్నారా అని అడిగారు. అన్ని మున్సిపాలిటీలు, కార్పోరేషన్లలో టీఆర్‌ఎస్ గెలుస్తుందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలను విపక్షాలు సోషల్ మీడియా ద్వారా తప్పుదోవబట్టించే ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ అన్నారవు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో ఎందుకు పూర్తి స్థాయిలో అభ్యర్థులను నిలబెట్టలేకపోయిందన్నారు.
'చిత్రం... తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని