తెలంగాణ

ప్రొఫెసర్ కాశిం అరెస్టుపై ప్రజాసంఘాల ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ప్రొఫెసర్ కాశిం అరెస్టుపై ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశిం అరెస్టును ఆయన సతీమణి స్నేహలత తీవ్రంగా ఖండించారు. ఐదేళ్ల క్రితం జరిగిన కేసుకు సంబంధించి ఇపుడు సోదాలు చేశారని, హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి వద్ద దొరికిన పుస్తకాలపై కేసు నమోదు చేయడం దారుణమని, ‘ నేను తెలంగాణ వాడినే ’ అనే పుస్తకంతో పాటు ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై రాసిన పుస్తకాలపై ఈ కేసులు నమోదు చేశారని అన్నారు.
ఈ పుస్తకాల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించినందకు తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేశారని ఆమె ఆరోపించారు. తలుపులను గడ్డిపారతో పగలగొట్టి అక్రమంగా పోలీసులు లోపలికి వచ్చారని, ఇంట్లో ప్రతి వస్తువును వెతికారని, కంప్యూటర్ హార్డు డిస్క్‌లను ఇంట్లో ఉన్న పుస్తకాలను తీసుకువెళ్లారని అన్నారు. కాశిం అరెస్టుపై ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ లక్ష్మణ్‌లు తీవ్రంగా ఖండించారు. అక్రమ కేసులను బేషరతుగా ఎత్తివేయాలని పీడీఎస్‌యు నేత దుబ్బ రంజిత్ కోరారు. తెలంగాణ విద్యావంతుల వేదిక తరఫున డాక్టర్ కొండా నాగేశ్వర్ , డాక్టర్ సమున్నత, డాక్టర్ ఈ ఉపేందర్, పీ రమణలు కాశీం అరెస్టును ఖండించారు. యూనివర్శిటీ అధ్యాపకుడిని అరెస్టు చేయడం దారుణమని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎల్ మూర్తి, కార్యదర్శి టీ నాగరాజులు విమర్శించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటన చేస్తూ కాశీం అరెస్టు అక్రమమని అన్నారు. టీటీఎఫ్, టీపీటీఎఫ్, టీడీటీఎఫ్‌ల నేతలు ఒక ప్రకటన విడుదల చేస్తూ కాశీం అరెస్టు అక్రమమని, అప్రజాస్వామికమని అన్నారు.
అరెస్టు చేయడం అన్యాయం
రాజ్యంగ పరిధిలోనే విద్యార్థులకు నిత్యం పాఠశాలు బోదిస్తు, ఎస్సీ, ఎస్టీ, బీసీ అణగారిన వర్గాల పక్షాన నిలబడ్డ ఉస్మానియా యూనివర్సీటీ ప్రొఫెసర్ ఖాసీంను శనివారం వర్సీటీలో ఉన్న క్వార్టర్స్‌లో గజ్వేల్ పోలీసులు ఆక్రమంగా ఆరెస్టు చయడాన్ని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండించింది. వెంటనే ఖాసీంపై ఉన్న కేసులను ఎత్తివేసి తక్షణమే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు.

''చిత్రాలు.. ప్రొఫెసర్ కాశిం అరెస్టుపై ఫ్రభుత్వ దిష్టిబొమ్మ దగ్థం చేస్తున్న ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు
*కాశిం అరెస్టుపై ఉస్మానియా యూనివర్శిటీలో నినాదాలు చేస్తున్న విద్యార్థులు