తెలంగాణ

కేటీఆర్‌పై వచ్చిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ఆరేళ్లకాలంలో మం త్రి కేటీ రామారావు నిర్వహించిన మైనింగ్ పరిశ్రమలు, మున్సిపల్, ఐటీ శాఖలపై విచారణకు ఆదేశించాలని, సమగ్ర విచారణ జరిపించాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడితే, సొంత కుమారుడినైనా వదిలేది లేదని కేసీఆర్ గతంలో ప్రకటించారన్నారు. ఈ డిమాండ్‌కు సానుకూలంగా స్పందించని పక్షంలో మరో మార్గాన్ని ఆశ్రయించాల్సి ఉంటుందన్నారు. విచారణకు ఆదేశించని పక్షంలో మంత్రి కేటీ రామారావు అవినీతిపై తాము కోర్టు తలుపుతడతామన్నారు. గడచిన ఆరేళ్లలో మీ కుటుంబ దోపిడీని త్వరలో సమగ్ర వివరాలు, ఆధారాలతో పుస్తక రూపంలో తెలంగాణ సమాజం ముందు ఉంచుతామని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. చీమలు పుట్టిన పుట్టలో పాములు దూరినట్లు, ఎందరో ఉద్యమకారుల త్యాగాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ నేడు కేసీఆర్ కుటుంబ భోగభాగ్యాలకు నెలవుగా మారిందన్నారు. ప్రతిపక్ష నేతల కదలికలపై నిఘా పెడుతున్న మీరు సొంత కుమారుడు ఏమి చేస్తున్నారో తెలియని స్థితిలో ఉంటారా అని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ శివార్లలోని ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్‌ల పరిరక్షణ కోసం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 83 గ్రామాల పరిధిలో జీవో 111 అమలులో ఉన్న విషయం తెలుసన్నారు. ఈ జీవో పరిధిలో గ్రామకంఠం భూములు మినహా ఇతర ప్రాంతాల్లో నిర్మాణాలు నిషేధమన్నారు. దీనిని ఉల్లంఘిస్తూ జన్వాడ గ్రామ పంచాయతీ పరిధిలో 25 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కేటీఆర్ రాజ్‌మహల్ నిర్మించుకున్నారన్నారు. 2014లో కేటీఆర్ తన ఆస్తుల విలువ రూ.8 కోట్లని ప్రకటించుకున్నారని, 2018 ఎన్నికల్లో తన ఆస్తులు ఏకంగా రూ.41 కోట్లని ప్రకటించుకున్నారన్నారు. త్వరలో ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెడుతారనే ప్రచారం చేయడం, అదే క్రమంలో పార్టీ ఆదాయం ఊహించని స్థాయిలో భారీగా పెరగడం వెనక రాజకోట రహస్యం ఏమిటో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.