తెలంగాణ

కేసీఆర్‌కు దమ్ముంటే మేనిఫెస్టోపై చర్చకు రావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 18: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దమ్ముంటే టీఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోపైనే చర్చకు వస్తారా అంటూ పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సవాలు విసిరారు. శనివారం ఆయన ఇక్కడ విలేఖర్లతో మాట్లాడుతూ మ్యానిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు. ప్రతి నిత్యం అంశాల వారీగా తను చెక్ చేసుకుంటానని చెప్పారు. తెలంగాణలో ఆరేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేసిందా అని నిలదీశారు. 99 శాతం హామీలు అమలు చేశామని చెబుతున్న కేసీఆర్, ఈ మ్యానిఫెస్టోను పట్టుకుని చర్చకు రావాలన్నారు. విద్యుత్ కొనుగోలు, దీర్ఘకాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, వాటిలో జరిగిన అక్రమాలు, కమిషన్లపై చర్చకు రావాలన్నారు. విభజన సమయంలో మనకు హక్కుగా రావాల్సిన ఒక్క పని అయినా అయిందా అని నిలదీశారు. విభజన చట్టం ముందు పెట్టుకుని చర్చించాలన్నారవు. అప్పులు, అవినీతి, ఆత్మహత్యలు, అవకాశవాద రాజకీయాలతో తెలంగాణ రాష్ట్రం అశాంతితో అట్టుడుకుతోందన్నారు. విద్య, ఉద్యోగ కల్పనలో ఎలా విఫలమయ్యారో చర్చించాలన్నారు. డబుల్ బెడ్‌రూం, దళితులకు, గిరిజనులకు వ్యవసాయ భూమి, గిరిజనులకు, ముస్లింలకు రిజర్వేషన్లు, కేజీ టు పీజీ, నిరుద్యోగ భృతి, రైతులకు రుణమాఫీ, రైతు బంధు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం, నగరాల అభివృద్ధి, మిషన్ భగీరథ లాంటి కీలక హామీలు ఏమయ్యాయన్నారు. కాళేశ్వరం అంటే కల్వకుంట్ల ప్రాజెక్టుగా మార్చారన్నారు. రుణమాఫీ చేయకపోతే టీఆర్‌ఎస్ దిమ్మెలను కూల్చారన్నారు. బలహీనవర్గాలకు గృహ నిర్మాణం అంటే ఇంకా ఇందిరమ్మ ఇళ్లే చూపిస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో తెచ్చిన ఉచిత కరెంటు ఇప్పుడు అమలు చేస్తున్నారన్నారు. అప్పటితో పోల్చితే పంట సాగుదిగుబడి కంటే తక్కువ దిగుబడి వచ్చిందన్నారు.