తెలంగాణ

రెండు కుటుంబాల చేతుల్లో ‘తెలంగాణ బందీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గోదావరిఖని, జనవరి 16: అనేక మంది త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ... దేశంలోనే ధనిక రాష్టమ్రైన తెలంగాణ.. ప్రస్తుతం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఓవైసీ కుటుంబాల చేతుల్లో తెలంగాణ బందీగా మారిందని కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా గురువారం రాత్రి పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో జరిగిన సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా నిజాం పాలన కొనసాగుతుందని మండిపడ్డారు. కేసీఆర్ ప్రజావ్యతిరేకని... అలాగే, అభివృద్ధికి వ్యతిరేకని అభివర్ణించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ దాటి అడుగు పెట్టడం లేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రానికి సెక్రటేరియట్ లేకపోవడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రం ఏర్పాటు తరువాత తెలంగాణలో ఎన్ని ఇళ్లు కట్టారో చెప్పాలని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ధనిక రాష్టమ్రైన తెలంగాణలో ప్రజలకు సౌకర్యాలు పూర్తిగా కరువైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కార్మికులకు ఏమి చేయలేకపోయిందని అన్నారు. రామగుండంలో మెడికల్ కాలేజీ నిర్మిస్తామని చెప్పి మాట తప్పారని అన్నారు. ఆరు సంవత్సరాల పాలనలో టీఆర్‌ఎస్ రామగుండంలో ఎంతో అభివృద్ధి చేసిందో చెప్పాలని అన్నారు. నాలుగేళ్ల తర్వాత రాష్ట్రంలో బీజేపీ పాలన ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జరుగబోయే మున్సిపల్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి... ఈ ఎన్నికల్లో తీర్పు టీఆర్‌ఎస్‌కు ఒక హెచ్చరిక కావాలని కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ వివేకా నంద, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, రాష్ట్ర నేతలు గుజ్జుల రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు.
'చిత్రం..గోదావరిఖనిలో మాట్లాడుతున్న కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి