తెలంగాణ

ధీశాలి జైపాల్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 16: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నేత దివంగత ఎస్ జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. గురువారం ఇక్కడ ఆయన జైపాల్ రెడ్డి 78వ జయంతి సందర్భంగా నెక్లెస్ రోడ్డులో జైపాల్ రెడ్డి ఘాట్‌లో చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి జైపాల్ రెడ్డి చేసిన సేవలను గుర్తు చేశారు. జైపాల్ రెడ్డి గొప్ప జాతీయవాది, లౌకికవాది, సోషలిస్టు, దేశ భక్తుడని పేర్కొన్నారు. గ్రామీణ, నగరాభివృద్ధికి జైపాల్ రెడ్డి చేసిన సేవలు విలువైనవన్నారు. తనకు జైపాల్ రెడ్డి పిత్రు సమానుడని, కుటుంబంలో ఒక సభ్యుడిగా నిలిచిపోయారని అనానరు. క్రమశిక్షణ, నైతిక విలువలు ఉన్న వ్యక్తి అన్నారు. శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అవతరించడంలో జైపాల్ రెడ్డి చేసిన కృషి నిరుపమానమన్నారు. హైదరాబాద్ నగరం తెలంగాణలో రాష్ట్రంలో ఉండేందుకు జైపాల్ చేసిన కృషి విలువైనదన్నారు. విభజన సమయంలో తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగకుండా మార్గనిర్దేశనం
చేశారన్నారు. హైదరాబాద్‌కు మెట్రో రైలు రావడానికి జైపాల్ రెడ్డి కృషి చేశారన్నారు. మాజీ మంత్రి డాక్టర్ జీ చిన్నారెడ్డి మాట్లాడుతూ, జైపాల్ రెడ్డి దేశ రాజకీయాల్లో నిబద్ధత ఉన్న మహా నేత అన్నారు. తెలంగాణ రాష్ట్రం అవతరించే సమయంలో పార్టీ అధిష్ఠానానికి ఉన్నతమైన సలహాలు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల స్కీంకు జైపాల్ రెడ్డి పేరు పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు చివరి దాకా పోరాడిన నేత అని నివాళులు అర్పించారు. మాజీ ఎంపీ వీ. హనుమంతరావు మాట్లాడుతూ పార్లమెంటులో ఉత్తమ ప్రసంగాలు చేసిన గొప్ప నేత జైపాల్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు పోరాడిన ధీశాలి అన్నారు. అన్ని అంశాలపై స్పష్టంగా మాట్లాడేవారన్నారు. ఆంగ్ల భాషలో వాక్చాతుర్యంతో మాట్లాడే నేత అన్నారు.

'చిత్రం...జైపాల్ రెడ్డి ఘాట్‌లో నివాళులు అర్పిస్తున్న పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి