తెలంగాణ

మున్సి‘పోల్’పై కాంగ్రెస్ విజన్ డాక్యుమెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ అన్ని మున్సిపాలిటీల్లో పెద్ద మెజారిటీతో గెలవాలనే లక్ష్యంతో సీనియర్ కాంగ్రెస్ నేతల ఆదేశంతో మాజీ ఎమ్మెల్సీ రంగారెడ్డి తెలంగాణ ప్రదేశ్ కమిటీ మున్సిపల్ ఎన్నికలు-2020 విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించారు. ఈ డాక్యుమెంట్‌ను టీపీసీసీ విడుదల చేసింది. విజన్ డాక్యుమెంట్ ప్రకారం.. అవినీతి రహితంగా మున్సిపాలిటీలను అత్యుత్తమ ప్రజా సేవా కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని, 500 చదరపు అడుగుల లోపు నిర్మాణ వైశాల్యం ఉన్న ప్రతి ఇంటికీ, మున్సిపల్ ట్యాక్స్‌ను రద్దు చేస్తారు. కొత్త బీఆర్‌ఎస్‌ను అమలు చేస్తారు. అదనపు గదులు నిర్మాణాలను క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం కల్పిస్తారు. తెల్లరేషన్ కార్డులు ఉన్న అందరికీ ఉచితంగా నల్లా కనెక్షన్, ఉచిత మంచి నీటి సరఫరా చేస్తారు. ప్రతి మున్సిపాలిటీలో అత్యాధునిక సదుపాయాలతో కూడిన ఇంటర్నల్ రోడ్లు, రోడ్డు డివైడర్లను నిర్మిస్తారు. ప్రతి మున్సిపాలిటీలో పార్కులు, గ్రీన్ బెల్టులు, చెరువుల సుందరీకరణ, బతుకమ్మ ఘాట్ల నిర్మాణం చేపడుతారు. ప్రతి మున్సిపాలిటీలో యువతీ, యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఎన్‌జీవోల తోడ్పాటుతో మధ్యాహ్నం, రాత్రి ఐదు రూపాయల భోజన
పథకం అమలు చేస్తారు. అన్ని మున్సిపాలిటీల్లో ఇండోర్ స్టేడియం, విశాలమైన క్రీడా మైదానాలు, రీడింగ్ రూంలు, ఇంటర్నెట్ సదుపాయాలతో కూడిన గ్రంథాలయాలు, ఉచిత వైఫై కూడళ్లను ఏర్పాటు చేస్తారు. అత్యాధునిక సదుపాయాలతో ఒక కబేళాను నిర్మిస్తారు. ప్రతి మున్సిపాలిటీలో ఒక ఆధునిక వేస్ట్ మేనేజిమెంట్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను నెలకొల్పుతారు. రజకులకు అత్యాధునిక సౌకర్యాలతో దోబీ ఘాట్లు, నారుూ బ్రాహ్మణులకు కుమ్మరి సంఘానికి వారి వృత్తులు కొనసాగించేందుకు భూమిని కేటాయిస్తారు. కనె్వన్షన్ సెంటర్ల ఏర్పాటు చేస్తారు. ఉపాధి కల్పన శిబిరాలను నిర్వహిస్తారు. ప్రతి పేద కుటుంబానికి వంద గజాల ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ. 6 లక్షల ఆర్థిక సాయం కోసం ప్రస్తుత ప్రభుత్వంపై వత్తిడి తెస్తామన్నారు. ఆధునిక సదుపాయాలతో కూడిన వంద పడకల ఆసుపత్రి, 108, 104 సర్వీసులను విస్తరిస్తారు. ప్రతివార్డులో అర్బన్ హెల్త్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ప్రతి మున్సిపాలిటీలో జూనియర్, డిగ్రీ, ఐటీఐ, పాలిటెక్నిక్ కళాశాలల ఏర్పాటు కోసం ప్రభుత్వంపై వత్తిడి తెస్తారు. అన్ని మతాల వారికి అవసరాలకు అనుగుణంగా శ్మశానవాటికలు, శవయాత్ర వాహనాలను కల్పిస్తారు.