తెలంగాణ

ఓట్ల కోసం వస్తున్న బీజేపీ నాయకులను నమ్మొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్తకోట, జనవరి 14: ఓట్ల కోసం వస్తున్న బీజేపీ నాయకులను నమ్మవద్దని... ప్రజల కోసం పని చేసే నాయకులకే ఓట్లు వేయాలని హోం మంత్రి మహమూద్ అలీ అన్నారు. మంగళవారం వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా ఆయన 15వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మహిమూద్ ఆలీ మాట్లాడుతూ పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో కేసీ ఆర్ అభివృద్ధి చేస్తున్నారని, దేశంలోనే నెంబర్ వన్‌గా తెలంగాణను ముందుంచారని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణకు విద్యుత్ ప్లాంట్లు లేవని హేలన చేస్తే ఇప్పుడు రైతులకు, ఇండస్ట్రీలకు, గృహాలకు నిరంతరం విద్యుత్‌ను అందిస్తున్నారని ఆయన అన్నారు. చార్మినార్ అంటే హిందు ముస్లీం క్రైస్తవ, సీక్కులకు ప్రతిభింభంగా నిలిచింది చార్మినార్ అని, సర్వమతాలను కేసీ ఆర్ ప్రేమిస్తున్నారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు అని, 20 సంవత్సరాల్లో పూర్తి కావల్సిన ప్రాజెక్టును మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశారన్నారు. 15కు 15 వార్డుల్లో అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచాలన్నారు.

'చిత్రం...ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న హోంమంత్రి మహమూద్ అలీ