తెలంగాణ

కొనసాగుతున్న కర్ఫ్యూ, 144 సెక్షన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్, జనవరి 14: నిర్మల్ జిల్లా భైంసాలో జరిగిన విధ్వంస ఘటన నేపథ్యంలో పోలీసులు విధించిన కర్ఫ్యూ కొనసాగుతోంది. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ ఉండగా మిగతా సమయంలో కర్ఫ్యూను సడలిస్తున్నారు. గుంపు గుంపులుగా రోడ్లపై సంచరాదని పోలీసులు ఆదేశించారు. పోలీసులకు పూర్తిగా సహకరించాలని మైక్‌ల ద్వారా కాలనీల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు. 144 సెక్షన్ సైతం పట్టణంలో కొనసాగుతుండగా రాత్రులు పోలీసులు మరింత పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. విధ్వంస ఘటన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి పోలీసు ఉన్నతాధికారులు భైంసాలోనే మకాం వేసి భధ్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఐజీ స్థాయి అధికారులు నాగిరెడ్డి, ప్రమోద్‌కుమార్‌లు భద్రత ఏర్పాట్లను పర్యవేక్షిస్తుండగా దాదాపు ఏడు జిల్లాల జిల్లా స్థాయి పోలీసు అధికారులు, డివిజన్ స్థాయి పోలీసు అధికారులు భైంసాలో పోలీసు బందోబస్తులో పాల్గొంటున్నారు.
పునరుద్ధరణకు నోచుకోని ఇంటర్నెట్ సేవలు
భద్రత చర్యల్లో భాగంగా ఆదివారం నుండి నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలు మంగళవారం సైతం పునరుద్ధరణకు నోచుకోలేదు. దాదాపు అన్ని నెట్‌వర్క్‌లకు చెందిన ఇంటర్నెట్ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సేవలు నిలిచిపోయి మూడు రోజులు గడుస్తుండగా బ్యాంకులు, వివిధ ప్రైవేటు సంస్థలు తమ లావాదేవీలు జరుపుకోలేకపోయాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలు సైతం నెట్ సేవలకు దూరమవడంతో అవస్థలు పడుతున్నారు.
'చిత్రం... కర్ఫ్యూతో నిర్మానుష్యంగా మారిన ప్రాంతం