తెలంగాణ

టీచర్లకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: ఉపాధ్యాయ సంఘాలతో జరిగిన భేటీ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను ఇప్పటికైనా అమలుచేయాలని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ డిమాండ్ చేసింది. 2018 మే 16న సీఎం ఉపాధ్యాయ సంఘాలతో ఐదున్నర గంటల పాటు ప్రగతి భవన్‌లో చర్చించారని, తర్వాత మరో రెండు గంటల పాటు మీడియా సమావేశం పెట్టి అనేక అంశాలను ప్రస్తావించారని, అవేవీ నేటికీ అమలుకు నోచుకోలేదని ఉపాధ్యాయ సంఘాల నేతలు పేర్కొన్నారు. పే రివిజన్ కమిటీని తక్షణం నియమించాలని, గత పాలకులు పీఆర్సీని నియమించడంలో జరిగిన జాప్యం వల్ల ఉద్యోగులు తమకు పెరగాల్సిన వేతనాన్ని నష్టపోయారని అన్నారు. ఇపుడు ఒక్కరితో కాకుండా తొందరగా నివేదిక ఇచ్చేందుకు ఇద్దరు ముగ్గురితో కమిటీని నియమించాలని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ రఘునందన్ కోరారు. 20 నెలలు గడచినా తొందరగా రావల్సిన పీఆర్‌సీ అతీగతీలేదని అన్నారు. రిపోర్టు ఎపుడో సిద్ధం అయిందని ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే సమర్పిస్తామని పీఆర్‌సీ కమిటీ సభ్యులు చెబుతున్నారని, అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ఒకటికి రెండుమార్లు సీఎం సైతం పీఆర్సీపై ప్రకటనలు జారీ చేశారలని ఇదంతా ప్రజల ముందు ఉద్యోగులను బదనాం చేయడానికి మాత్రమే ఉపయోగించుకున్నారని ఆరోపించారు. అలాగే సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకుంటామని అన్నారని, ఉద్యోగులకు జీతాలు పెంచుతున్నట్టు , బాగా జీతాలు పెరిగినట్టు సీఎం చేస్తున్న ప్రకటనల వల్ల ఉద్యోగులపై తప్పుడు అభిప్రాయం కలుగుతోందని అన్నారు. ప్రభుత్వ నిర్వాకంతో పాఠశాలలు నిరాదరణకు గురై అనాధలుగా మిలిగిపోతున్నాయని చెపాపరు. నెలకో పాఠశాల మూతపడే పరిస్థితులను ప్రభుత్వమే కల్పిస్తోందని, గత రెండేళ్లుగా రిటైర్ అయిన వేలాది ఉపాధ్యాయులు స్థానే కొత్త వారిని నియమించడం లేదని అన్నారు. ఫలితంగా స్కూళ్లలో బోధించే ఉపాధ్యాయులు లేక విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని వ్యాఖ్యానించారు.