తెలంగాణ

నిష్పక్షపాతంగా మున్సిపల్ ఎన్నికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్ధులు ఖరారయ్యారని, కనుక ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరగడానికి ఎన్నికల అధికారులు పూర్తిగా తమకున్న అధికారాలను సద్వినియోగం చేసుకోలని అన్నారు. ఓటర్ల స్వేచ్ఛను హరించడానికి రకరకాల పద్ధతులతో ప్రలోభాలకు గురిచేసే అవకాశం ఉందని అన్నారు. చట్టం అందరికీ ఒకే రకంగా అమలుచేయాలని, నిబంధనలను ఎవరు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని చాడ కోరారు. నిర్మల్ జల్లా బైంసా లో జరిగిన మత ఘర్షణలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు చెప్పారు. ఈ ఘర్షణలకు ఆజ్యం పోసిన వ్యక్తులను గుర్తించి, వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని అన్నారు. పొంచి ఉన్న మతతత్వ శక్తులకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం కఠినంగా, నిష్పక్షపాతంగా వ్యవహరించాలని అన్నారు. ఉభయ వర్గాల వారూ సంయమనం పాటించాలని, మత సామారస్యాన్ని పెంపొందించేందుకు శాంతి యాత్రలు నిర్వహించాలని, భుత్వం అలాంటి వాతావరణం కలిగించేందుకు పూనుకోవాలని అన్నారు. లౌకిక వ్యవస్థకు నిలయంగా ఉన్న తెలంగాణ ఖ్యాతిని నిలబెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు.