తెలంగాణ

కైట్ ఫెస్టివల్‌కు అనూహ్య స్పందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 14: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్‌లోని పరేడ్ మైదానంలో జరుగుతున్న అంతర్జాతీయ కైట్, స్వీట్ ఫెస్టివల్ రెండో రోజు మంగళవారం నేత్రపర్వంగా కొనసాగింది. ఈ ఫెస్టివల్ బుధవారంతో ముగియనున్నది. ప్రారంభ రోజు కైట్ ఫెస్టివల్‌ను తిలకించడానికి వచ్చిన వారితో పోల్చిచూస్తే రెండో రోజు నగర వాసులు భారీగా తరలివచ్చారు. ఇందులో యువతి యువకులు అధికంగా ఉన్నారు. 20 దేశాలు, 25 రాష్ట్రాల నుంచి అంతర్జాతీయ, జాతీయ కైట్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ వేడులను చూసేందుకు నగరంతో పాటు వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సెలవు కావడంతో సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో పతంగులు ఎగురవేస్తున్న వారితో కళకళాడింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖతో పాటు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (సాట్స్), తెలంగాణ విజయ డైరీ, హైదరాబాద్ పోలీసులు ఈ కైట్ ఫెస్టివల్‌లో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేశారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కనివినీ ఎరుగని రీతిలో ఏర్పాట్లు చేశారు. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి 25 రాష్ట్రాలకు చెందిన 60 మంది జాతీయ స్థాయి కైట్ ప్లేయర్లతో పాటు 20 దేశాలకు చెందిన అనుభవం కలిగిన కైట్ ప్లేయర్లు పాల్గొంటున్నందున ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మూడు రోజుల పాటు జరుగనున్న ఈ ఫెస్టివల్‌లో హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న వివిధ రాష్ట్రాలకు చెందిన మహిళలు తమ ఇంటిలో తయారుచేసిన స్వీట్‌లను ఈ ఫెస్టివల్‌లో అమ్మకాలు చేపట్టారు. సంక్రాంతి పండుగ సందర్భంగా స్వీట్‌ల అమ్మకాలు మంగళవారం జోరుగా సాగాయి. హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి పోలీసు బందోబస్తును ముమ్మరం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ రకల అమ్మకాలు, స్వీట్స్ ప్రత్యేక స్టాల్స్ ఆకర్షణగా నిలిచాయి.
'చిత్రం... సికిందరాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో మంగళవారం రెండో రోజు కైట్ ఫెస్టివల్‌లో భాగంగా సందర్శకులను ఆకట్టుకొన్న పతంగులు