తెలంగాణ

మున్సి‘పోల్’లో అప్రమత్తం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల ఎన్నికల సమయంలో ప్రతి అంశంపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారులైన కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి. నాగిరెడ్డి విజ్ఞప్తి చేశారు. మున్సిపల్ ఎన్నికల ఏర్పాట్లపై సోమవారం ఆయన జిల్లా యంత్రాంగాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ ఎన్నికల్లో ఓటర్లంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఓటర్లలో చైతన్యం కలిగించాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును పూర్తిగా వినియోగించుకోవడం లేదని గుర్తు చేశారు. కారణాలు ఏవైనా పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకునేలా చూడాలని కోరారు.
ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులకు ఎన్నికల గుర్తును కేటాయించే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నాగిరెడ్డి పేర్కొన్నారు. బ్యాలెట్ పేపర్ ముద్రణకు ముందు అభ్యర్థుల వివరాలు పూర్తిగా, సక్రమంగా ఉన్నాయో? లేదో? ఒకటికి రెండు సార్లు పరిశీలించాలన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటరు జాబితాలను తయారు చేయని మున్సిపల్ కమిషనర్లు వెంటనే ఆ పని పూర్తిచేయాలని సూచించారు. పోలింగ్ రోజు ఓటు వేసేందుకు వచ్చే ఓటరు చేతికి సిరా గుర్తు వేసేప్పుడు నిశితంగా పరిశీలించాలని, ఒక వ్యక్తి ఒకే పర్యాయం ఓటు వేసేలా చూడాలన్నారు. ఓటు వేసేందుకు వచ్చే ఓటర్లు తమ వెంట ఎన్నికల కమిషన్ ప్రకటించిన గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకదాన్ని తీసుకువచ్చేలా చూడాలన్నారు. ఓటరు గుర్తింపు కార్డు పరిశీలించిన తర్వాతనే ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వాలన్నారు. పోలింగ్ కేంద్రాల్లో వౌలిక సదుపాయాలను కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నాగిరెడ్డి సూచించారు.
పోలింగ్ విధులు నిర్వర్తించేందుకు నియామకం అయిన సిబ్బందికి రెండోవిడత శిక్షణ వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. పోలీసు అధికారులతో చర్చించి ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలింగ్ రోజు ఉండబోయే బందోబస్తు వివరాలను నిశ్చయించి, అన్ని రాజకీయ పార్టీలకు, ఓటర్లకు తెలియచేయాలన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ శ్రీదేవి, రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యదర్శి అశోక్ కుమార్ పాల్గొన్నారు.

'చిత్రం...సమావేశంలో మాట్లాడుతున్న కమిషనర్ నాగిరెడ్డి