తెలంగాణ

గ్రామాల్లో విద్యాజ్యోతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: మిషన్ భగీరథ పథకం ద్వారా గ్రామగ్రామానికి గంగమ్మ తల్లిని తీసుకువచ్చిన విధంగానే ప్రతి గ్రామంలో విద్యాజ్యోతిని వెలిగించాల్సిన అవసరముందని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు అన్నారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాలని కూడా ఆయన రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్‌కు సూచించారు. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు సీఎం కేసీఆర్ తీసుకుంటున్న చర్యలు మంచి ఫలితాలిస్తున్నాయని, ఇదే విషయంపై త్వరలోనే ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు వెల్లడించారు. సోమవారం రవీంద్రభారతిలో విశ్వనాథ సాహితీ పీఠం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విద్యాసాగర్‌రావు మూడు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో లక్షలాది మంది నిరుద్యోగులు ఉండటం బాధాకరమని అన్నారు. పదవ తరగతి విద్యార్థికి రెండో తరగతి ప్రమాణాలు కూడా ఉండటం లేదని ఆయన విచారం వ్యక్తం చేశారు. ప్రమాణాలు మెరుగుపడాలంటే విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరగాల్సిన అవసరముందని అన్నారు. ప్రతి విద్యార్థికి ఒకటవ తరగతి నుంచి ఆరో తరగతి వరకు మాతృభాషలోనే విద్యాభోధన జరగాలని, అపుడే ఆ విద్యార్థుల పునాదాలు పటిష్టంగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో అక్షరాస్యతను పెంచేందుకు సీఎం కేసీఆర్ కంకణబద్దులయ్యారని వివిరంచారు. చదువుల తల్లి సరస్వతీ దేవి ఆశీర్వాదాలతో ప్రతి పల్లెలో విద్యా కుసుమాలు పరిమళించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మాతృభాషను ఎవరూ విస్మరించకూడదని, మాతృభాషలోనే విద్యాభోధన జరిగితే ఇతర భాషల్లోనూ రాణిస్తారని వివరించారు. రాష్ట్రంలోని చాలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కన్నా ఉపాధ్యాయుల సంఖ్యే ఎక్కువగా ఉందని, ఈ విషయంలో ఉపాధ్యాయ సంఘాల నేతలు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
ప్రభుత్వం మూడేళ్ల క్రితం ప్రారంభించిన గురుకులాల్లో విద్యాభోధన ప్రమాణాలు చాలా మెరుగ్గా ఉన్నాయని, అందుకే గురుకుల్లాల్లో ప్రవేశాలకు బాగా ఆదరణ పెరిగిందని వివరించారు. ఈ కార్యక్రమంలో శాంత బయోటిక్ చైర్మన్ వరప్రసాద్ రెడ్డి, విశ్వనాథ సాహితీ పీఠం అధ్యక్షుడు ప్రొ.వెల్చాల కొండల్‌రావుపాల్గొన్నారు.
'చిత్రం...పుస్తకావిష్కరణ సభలో పాల్గొన్న మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు, వినోద్‌కుమార్ తదితరులు