తెలంగాణ

కాలుష్య నివారణపై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: కాలుష్య నివారణ కోసం తీసుకున్న చర్యలు, అమలు తీరు, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదికను జనవరి 31 వరకు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశించారు. ఈనెల 31న ఎన్‌జీటీ సమావేశం జరుగుతోందని, ఈ సమావేశంలో చర్చించే అంశాలపై కూలంకషంగా సమీక్షించారు. బీఆర్‌కే భవన్‌లో సోమవారం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ, ఘనవ్యర్థాల నిర్వహణ నియమాల అమలు, బయోమెడికల్ వేస్ట్ యాజమాన్యం, తీసుకుంటున్న చర్యలు, నదీ ప్రవాహాల్లో కాలుష్య నివారణ చర్యలు, ఎస్‌టీపీల నిర్మాణం, వ్యర్థ జలాల శుద్ధీకరణ తదితర అంశాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌కు నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. ఎన్‌జీటీకి సమర్పించాల్సిన నివేదికలో ఇప్పటి వరకు కాలుష్య నియంత్రణపై తీసుకున్న చర్యలను వివరించాల్సి ఉందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్ కుమార్ మాట్లాడుతూ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉత్తర్వుల ప్రకారం టైం బౌండ్ యాక్షన్ ప్లాన్ అమలుకోసం తీసుకున్న చర్యలను వివరించారు. గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య కార్యక్రమాలు, చెత్త సేకరణకు తీసుకున్న చర్యలను పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి వికాస్ రాజ్ వివరించారు. ఈ సమావేశంలో పశుసంవర్థకశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, మెట్రోవాటర్ వర్క్స్ మేనేజింగ్ డైరెక్టర్ దానకిషోర్, పీసీబీ సభ్య కార్యదర్శి నీతూ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.