తెలంగాణ

అదో ‘రాజకీయ’ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 13: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ రాజకీయ చెలగాటం కోసమేనని, వారేమీ ప్రజాసమస్యల పరిష్కారానికి సమావేశం కాలేదని బీజేపీ తీవ్రంగా స్పందించింది. మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ సోమవారం పార్టీ కార్యాలయంలో పాత్రికేయులతో మాట్లాడారు. అనంతరం ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎంల భేటీ ద్వారా గత కొద్ది సంవత్సరాలుగా ఒరిగిందేమీ లేదని, ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు ఎక్కడివి అక్కడే ఉన్నాయని చెప్పారు. వివిధ శాఖలకు సంబంధించిన ఏ సమస్య పరిష్కారం కావడం లేదని, కానీ ఇరువురు ముఖ్యమంత్రుల వ్యక్తిగత ప్రయోజనాలను మాత్రం కాపాడుకుంటున్నారని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను కాపాడటంలో మాత్రం ముఖ్యమంత్రి విఫలమయ్యారని పేర్కొన్నారు. ఉద్యోగుల బదిలీలు, అక్రమ నీటిపారుదల ప్రాజెక్టులు, నీటి విడుదలలో రాష్ట్రానికి నష్టం జరుగుతుంటే కూడా సీఎం చోద్యం చూస్తున్నారని అన్నారు. జగన్‌ను అక్రమ కేసుల నుండి ఎలా కాపాడాలో అనే అంశంపైనే దృష్టి సారించారని ఆరోపించారు. జగన్మోహన్‌రెడ్డి కేసుల్లో ఒకరు కేసీఆర్ మంత్రివర్గంలో కూడా ఉన్నారని, దాంతో ఏ విధంగా తాను సహకరించాలనే అంశంపై ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. ఒకవేళ ప్రజలకు సంబంధించిన అంశంపైనే చర్చలు జరిగి ఉంటే ఇంత ఏకాంత చర్చలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకవేళ ప్రజల సమస్యలైతే ఇరు రాష్ట్రాల సీఎస్‌లు పాల్గొనలేదు కదా? అని అన్నారు.
మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు అంతా అటు ఎంఐఎం, ఇటు కాంగ్రెస్ నుండి వచ్చిన వారేనని అన్నారు. సీఏఏకు వ్యతిరేకంగా జరిగే ర్యాలీలకు ఎన్నికల కమిషన్ అనుమతి ఇవ్వవద్దని, అలాంటి ర్యాలీలపై ఎన్నికల కమిషన్ ఒక కనే్నసి ఉంచాలని సూచించారు. వివిధ ప్రాంతాల్లో ఎంఐఎం హిందువులపై దాడులకు పాల్పడి భయోత్పాతాన్ని సృష్టిస్తోందని అన్నారు. ఈమధ్య కేటీఆర్ సీఎం కంటే ఎక్కువ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. బీజేపీ ఎక్కడ ఉందో మాజీ ఎంపీ కవితను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. 8956 మంది అభ్యర్ధులను టీఆర్‌ఎస్ నిలిపిందని, అందులో 3 వేల మంది ఇతర పార్టీలవారేనని గుర్తుంచుకోవాలని అన్నారు. ఇతర పార్టీల వారిని ప్రలోభపెట్టి బీ ఫారంలు ఇస్తున్నారని పేర్కొన్నారు. అధికార పార్టీకే అభ్యర్థులు కొరవడ్డారని అన్నారు.