తెలంగాణ

హిందువులకు రక్షణ కరువు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భైంసా రూరల్: తెలంగాణ రాష్ట్రంలో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు అన్నారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఆదివారం రాత్రి విధ్వంస ఘటన చోటుచేసుకున్న నేపథ్యంలో బాధితులను పరామర్శించేందుకు భైంసాకు వచ్చిన వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఐజీ ముందు ప్రవేశపెట్టారు. అనంతరం పట్టణంలోని ఒక బీజేపీ నేత ఇంట్లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవితో కలిసి నిర్వహించిన విలేఖరుల సమావేశంలో వీరు మాట్లాడారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మున్సిపల్ ఎన్నికలో లబ్ధి పొందేందుకు ఎంఐఎంతో కలిసి కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి కోసం ఒక వర్గం చేసే పనులకు
మద్దతు తెలుపుతూ నీచ రాజకీయాలకు ప్రభుత్వం పాల్పడుతోందని అన్నారు. పతకం ప్రకారమే హిందువులపై దాడులు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని వారు ఆరోపించారు. ప్రభుత్వం సిగ్గుమాలిన చర్యలకు పాల్పడుతూ అమాయక ప్రజలకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తోందని అన్నారు. స్థానిక ముథోల్ ఎమ్మెల్యే చేతగానితనంతో భైంసా పట్టణంలో పోటీ చేసిన టీఆర్‌ఎస్ నామినేషన్లు సైతం వెనక్కి తీసుకొని ఎంఐఎంకు ఏకగ్రీవం చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఎంఐఎం అధినేత ఒవైసీ కలిసి రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతూ హిందువులపై దాడులకు పాల్పడుతుంటే పోలీసు యంత్రాంగం ప్రేక్షక పాత్ర వహించడం సిగ్గుచేటని వారు ఆరోపించారు. హిందూ మహిళలను, పిల్లలను ఒక వర్గం వారు హింసిస్తే ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని వారు ధ్వజమెత్తారు. . కాశ్మీర్ సంస్కృతికి భైంసాలో జరిగిన ఘటన అద్దం పడుతుందని వారు అన్నారు. రాళ్ళ దాడులు, ముసుగులు ధరించి దాడులు చేయడం కాశ్మీర్‌లో జరుగుతున్న ఘటనలకు నిదర్శనమని, భైంసాలో సైతం అదే విధంగా దాడులకు పాల్పడుతూ ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారన్నారు. పథకం ప్రకారమే అల్లర్లు జరుగుతున్నప్పటికీ అల్లర్లను పసిగట్టడంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీసు వ్యవస్థ పూర్తిగా విఫలమయ్యాయని వారు ఆరోపించారు. గత ఎన్నికల సమయంలో హిందువులు బొందువులు అని అన్న ముఖ్యమంత్రి అదే విధంగా ప్రవరిస్తూ హిందువుల పట్ల నిర్లక్ష్యం వహించడం ఈ ఘటనకు తార్కాణమని అన్నారు. రాష్ట్రంలో హిందువుల పరిస్థితి దయనీయంగా మారిందని తెలిపారు. భైంసా ఘటన విషయమై తమ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డికి వివరించి బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఈ ఘటన పునరావృతం కాకుండా పోలీసు వ్యవస్థ ఇప్పటికైనా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లను చేయాలని వారు డిమాండ్ చేశారు. విలేఖరుల సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు డాక్టర్ రమాదేవితో పాటు ఎన్నికల జిల్లా ఇన్‌చార్జి శ్రీనివాస్, సీనియర్ బీజేపీ నాయకులు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, విష్ణు ప్రకాష్ బజాజ్, రవిపాండే, నారాయణరెడ్డి, రామకృష్ణగౌడ్, గంగారెడ్డి, బాలాజీ సూత్రావే తదితరులు పాల్గొన్నారు.