తెలంగాణ

టీఆర్‌ఎస్ తరఫున అత్యధిక నామినేషన్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల పర్వంలో తాజా సమాచారం ప్రకారం టీఆర్‌ఎస్ అభ్యర్థులు అత్యధికంగా నామినేషన్లు దాఖలు చేశారు. కరీంనగర్ మినహా మిగతా తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో 3052 వార్డులు ఉండగా 25,768 నామినేషన్లు దాఖలైనట్టు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదివారం ఇక్కడ ప్రకటించింది. వీటిలో 432 నామినేషన్లను తిరస్కరించగా, 25,336 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్టు వెల్లడించారు. కొంత మంది అభ్యర్థులు ఒకటికన్నా ఎక్కువ నామినేషన్లు వేశారు. మొత్తం నామినేషన్లు వేసిన వారు 19,673 గా తేలింది.
3,052 వార్డులకు టీఆర్‌ఎస్ తరఫున 8,956 నామినేషన్లు దాఖలు కాగా కాంగ్రెస్ పార్టీ తరఫున 5,365 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ తరఫున 4,179 నామినేషన్లు, బీఎస్‌పీ తరఫున ఆరు, సీపీఐ తరఫున 269, సీపీఎం తరఫున 268, ఎన్‌సీపీ తరఫున 36, ఎంఐఎం తరఫున 441, టీడీపీ తరఫున 433, వైకాప తరఫున 4 నామినేషన్లు దాఖలయ్యాయి. రాష్టస్థ్రాయి గుర్తింపు ఉన్న పార్టీల తరఫున 385, రికగ్నైజ్డ్ పార్టీల తరఫున 99 నామినేషన్లు, స్వతంత్రులు 4,889 నామినేషన్లు దాఖలయ్యాయి.
కార్పొరేషన్లలో ఇదీ పరిస్థితి
కరీంనగర్ మినహా మిగతా తొమ్మిది మున్సిపల్ కార్పొరేషన్లలో 325 వార్డు స్థానాలు ఉండగా 3,319 నామినేషన్లు వచ్చాయి. 2,451 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తొమ్మిది కార్పొరేషన్లు, 120 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 14 వరకు గడువుగా ఉంది. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌లో 60 వార్డులు ఉండగా ఆదివారం సాయంత్రమే నామినేషన్‌పత్రాలు దాఖలు చేసేందుకు గడువు ముగిసింది. కరీంనగర్ కార్పొరేషన్‌లోని అన్ని వార్డులకు కలిపి 1,052 నామినేషన్లు దాఖలైనట్టు అధికారికంగా ప్రకటించారు. ఈ కార్పొరేషన్‌లో ఈ నెల 16 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుగా ఉంది.