తెలంగాణ

పురపాలికలకు నిధుల కేటాయింపుపై శే్వతపత్రం విడుదల చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి, మున్సిపాలిటీలకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని, అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. ఏ వేదిక మీదైనా సరే చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన ప్రకటించారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల అభివృద్ధి, నిధుల కేటాయింపుపై శే్వతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గత ఆరేళ్లలో రాష్ట్రంలో మున్సిపాలిటీల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. ఆదివారం ఇక్కడ ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ సీఎం సీటుపై కేటీఆర్ మోజు పడుతున్నారని, దీంతో కేసీఆర్‌కు ఇంటిపోరు నడుస్తోందన్నారు. దీంతో ఏంచేయాలో తెలియక మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కేసీఆర్ లింకు పెట్టారన్నారు.
మున్సిపాలిటీల అభివృద్ధిపై కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారన్నారు. వరంగల్‌కు రూ.300 కోట్లు, నిజామాబాద్, రామగుండం, కరీంనగర్, ఖమ్మం కార్పొరేషన్లకు వంద కోట్ల రూపాయల నిధులు ఇచ్చామని కేటీఆర్ చెబుతున్నారన్నారు. ఆయా కార్పొరేషన్లలో ఏ పని కావాలన్నా ఫండ్స్ లేవనే సమాధానం వస్తోందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలో 95 శాతం రోడ్లు సర్వనాశనమయ్యాయన్నారు. మున్సిపాలిటీల్లో భూముల కబ్జాలు పెరిగాయన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీలో పనుల మంజూరుకు మూడు శాతం కమీషన్‌ను అధికార పార్టీ నేతలు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు. అర్బన్
ప్రాంతాల్లో శానిటేషన్, హెల్త్ అంశాలపై చెప్పాల్సిన పనే లేదన్నారు. తెలంగాణలో 2018లో 4,592 డెంగ్యూ కేసులు, 2019లో 12,072 కేసులకు పెరిగాయన్నారు. బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారని, కానీ ఇవేమీ కనపడడం లేదన్నారు. 2018లోనే నాలుగు నెలల్లో 400 కుక్కకాటు కేసులు నమోదయ్యాయన్నారు. కరీంనగర్ మున్సిపాలిటీ అధ్వాన్నంగా ఉందన్నారు. మానేరు చెంతనే ఉన్నా కరీంనగర్‌లో మంచినీటి సమస్య ఉందన్నారు. రాష్ట్రంలో 45 శాతం జనాభా అర్బన్ ఏరియాలో ఉంటున్నారన్నారు. వ్యూహాత్మక రోడ్లు, అభివృద్ధి పనులు రూ.3,000 కోట్లతో జరుగుతున్నాయని తప్పుడుప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. 111 జీవో రద్దు కాకుండానే నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలు నిర్మాణాలు చేశారన్నారు. ఇక మిషన్ భగీరథ కింద ప్రతి ఇంటికీ మంచినీరు అందిస్తామన్నారు. కానీ రూ.40 వేల కోట్ల ఖర్చు చేసినా నీరు రాలేదన్నారు. సంగారెడ్డి జిల్లాలోనే వంద కిలోమీటర్ల మేర జరగాల్సిన పనులు ఒక్క కి.మీ మాత్రమే పూర్తికావడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కరీంనగర్, వరంగల్ లండన్, న్యూయార్క్‌గా ఎందుకు మారలేదన్నారు. మిషన్ భగీరథపై మాట తప్పినందుకు ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు పోటీ చేసే అర్హత కూడా లేదన్నారు. ఈ సమావేశంలో పార్టీ అధికార ప్రతినిధి బీ అయోధ్యరెడ్డి కూడా పాల్గొన్నారు.

'చిత్రం... మల్కాజిగిరి పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడుతున్న కాంగ్రెస్ ఎంపీ రేవంత్‌రెడ్డి