తెలంగాణ

బలహీనవర్గాలకు భారీగానే టికెట్లు ఇచ్చాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: ప్రతి అంశంలో నూతన ఒరవడి సృష్టించే టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తనదైన ప్రత్యేకతను చాటారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల మున్సిపాలిటీలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బలహీనవర్గాలకు పురపాలక ఎన్నికల్లో 91 శాతంపైగా బీ ఫారాలు అందించారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి టీఆర్‌ఎస్ కట్టుబడి ఉందన్నారు. ఈ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేస్తామన్నారు. బీ ఫారాలు అందించిన అనంతరం ప్రతి ఒక్క అభ్యర్థితో కేటీఆర్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఏదైనా ఇబ్బంది ఉంటే, సమస్యలు ఉంటే తన దృష్టికి తేవాలన్నారు. అభ్యర్థుల గెలుపుకోసం అన్ని విధాలుగా సహకరిస్తామన్నారు. సిరిసిల్ల మున్సిపాలిటీపైన గులాబీజెండా ఎగురుతుందన్నారు. ఐదున్నరేళ్లుగా పట్టణంలో తెచ్చిన మార్పులను వివరించారు. ప్రతి ఓటరును స్వయంగా కలిసేందుకు ప్రయత్నిస్తామన్నారు. పట్టణ పార్టీ అవసరాల మేరకు తుది ఎంపిక జరిగిందన్నారు. అభ్యర్థిత్వం ఆశించిన అభ్యర్థులతో కూడా మాట్లాడానని చెప్పారు. పార్టీ అధికారంలో ఉన్నందున ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుందన్నారు.

'చిత్రం... సిరిసిల్ల మున్సిపాలిటీ నుంచి పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బీ ఫారాలు అందజేస్తున్న టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్