తెలంగాణ

హామీలేవీ నెరవేర్చకుండానే మాటలతోనే గడిపేస్తున్న కేసీఆర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఏదీ నెరవేర్చకుండానే మాటలతో గడిపేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాడుతున్నా, చేతలు మాత్రం గడప దాడటం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఇటీవల బీజేపీలో చేరిన టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు తొలి సారి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఆయనను బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, పార్టీ రాష్డ్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ సహా అనేక మంది మోత్కుపల్లిని అభినందించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇస్తున్న వందల కోట్ల రూపాయిలను దారిమళ్లించారని ఆరోపించారు. ఎన్నికల హామీలన్నింటినీ తుంగలో తొక్కిన టీఆర్‌ఎస్‌ను గెలిపించాలని ఆడిగే హక్కు లేదని అన్నారు. ప్రతి మున్సిపాల్టీలో భూగర్భ డ్రైనేజీలు నిర్మిస్తామని, అందమైన రోడ్లు నిర్మిస్తామని హామీలు ఇచ్చారని, ఒక మున్సిపాల్టీని ఇస్తాంబుల్ చేస్తామని, లండన్ చేస్తామని, డల్లాస్ చేస్తామని చెప్పారని పాలక సంస్థలు కనీస అభివృద్ధికి నోచుకోక, పారిశుద్ధ్యం కొరవడి, అంటువ్యాధులు సోకి, పేద ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయని అన్నారు. వీటన్నింటినీ ప్రజలు మరిచిపోలేదని అన్నారు. రోడ్ల నిర్మాణాన్నీ పట్టించుకోలేదని చెప్పారు. ఏ విధంగానూ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదని, ఎమ్మెల్యేల నిధులు ఉన్నా వాటిని సీఎం తన గుప్పిట్లో పెట్టుకుని , సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలు మినహాయిస్తే మిగతా ప్రాంతాల అభివృద్ధికి ఎక్కడా ఖర్చుచేయడం లేదని ఆరోపించారు. రాష్ట్రం అంటే ఈ మూడు నియోజకవర్గాలేనా అని ప్రశ్నించారు. వందల కోట్ల రూపాయిలు ఈ మూడు నియోజకవర్గాలకే ఇస్తారా అని నిలదీశారు. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఎంఐఎంలు ఒకే తాను ముక్కలని ఆరోపించారు. ఓవైసీ చెప్పుచేతల్లో ఈ ప్రభుత్వం కొనసాగుతోందని, ఆయన మెప్పుకోసమే ఇద్దరు పిల్లల నిబంధనను మినహాయించారని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే ఎంఐఎంకు వేసినట్టేనని అన్నారు. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే టీఆర్‌ఎస్‌కు వేసినట్టేనని చెప్పారు. పొరపాటున కూడా వోటు వృధా చేసుకోవద్దని, బీజేపీకి ఓటు వేసి నిబద్ధతను చాటుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి నియంతపాలనను గోరికడతామని మోత్కుపల్లి పేర్కొన్నారు. సీఎంను గద్దెదించడమే తన లక్ష్యమని చెప్పారు. ఎంత మంది మరణిస్తున్నా కేసీఆర్ గేటు తెరవడం లేదని సామాన్యుల బాధలను పట్టించుకోవడం లేదని అన్నారు. గడ్డుకాలాన్ని ఎదుర్కొనేందుకు పార్టీలోని అంతా కలిసి పోరాటం చేయాల్సి ఉందని చెప్పారు. ఇపుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా టీఆర్‌ఎస్ మట్టికరుస్తుందని పేర్కొన్నారు.