తెలంగాణ

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్థుల కొరత!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పురపోరులో సత్తాచాటాలని భావించిన బీజేపీ అందుకు తగ్గట్టు అభ్యర్థులను సిద్ధం చేసుకోవడంలో విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి. అనూహ్య ఫలితాలతో ఈసారి టీఆర్‌ఎస్‌కు షాక్ ఇద్దామని చూసిన బీజేపీకి అలాంటి అవకాశాలకు తగ్గట్టు సన్నద్ధత కన్పించడం లేదని పార్టీ నేతలో వాపోతున్నారు. గత నాలుగు నెలలుగా పార్టీ అనేక కార్యక్రమాలను చేపట్టింది. శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత అదే పనిగా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, వౌలిక సదుపాయాలు, రోడ్లు, ఇళ్ల నిర్మాణం, డ్రైనేజీలు, పారిశుద్ధ్యం, పచ్చదనం , తాగనీటి ,సాగునీటి అంశాలనే ప్రధానంగా తీసుకుని పార్టీ పెద్ద ఎత్తున చైతన్య కార్యక్రమాలను నిర్వహించింది. మరో పక్క ప్రజల నుండి పార్టీకి లభిస్తున్న మద్దతు కూడా పెరగడంతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో అనూహ్య ఫలితాలను సాధించి, మున్సిపల్ ఎన్నికలపై అంచనాలను పెంచింది. మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల ఎంపిక మొదలు, వారి జాబితాను ఖరారు చేయడంలో క్లస్టర్ ఇన్‌ఛార్జిలు విఫలమయ్యారు. పార్టీలో కూడా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే అనేక మందిని ఇతర పార్టీల నుండి చేర్చుకున్నారు. ఫలితాలు కూడా అనుకూలంగా ఉంటాయని పార్టీ తొలి నుండి భావిస్తోంది. అంతా బాగానే ఉన్నా రాష్ట్రంలో ఈ నెల 22న జరిగే 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్ల ఎన్నికల్లో బీజేపీకి అభ్యర్ధుల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. మున్సిపాల్టీల్లో , కార్పొరేషన్లలో అన్ని వార్డులకూ పోటీ చేయాలని భావించిన బీజేపీకి సరిపడా అభ్యర్ధులు దక్కకపోవడంతో అన్ని వార్డులూ, అన్ని డివిజన్లలో తమ తరఫున పార్టీ నేతలను బరిలో నిలపలేకపోయింది. రామగుండం, బడంగిపేట, మీర్‌పేట, బండ్లగూడ, బోడుప్పల్, ఫిర్జాదీగూడ, నిజాంపేట, నిజామాబాద్, కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లలో అన్ని డివిజన్లలో అభ్యర్ధులను నిలపలేకపోయింది. దాంతో గడువు ఉపసంహరణలోగా ప్రస్తుతం నామినేషన్లు వేసిన అభ్యర్ధులకే మద్దతు ఇచ్చే అంశంపై చర్చ జరుగుతోంది. అన్ని జిల్లాల్లో పార్టీకి మంచి ఊపు ఉన్నా, సరిపడా అభ్యర్థులను మాత్రం సిద్ధం చేసుకోలేకపోయింది. రాష్ట్ర నాయకత్వం స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను ఆయా జిల్లాల నాయకులకే విడిచిపెట్టడంతో పార్టీలో గందరగోళం నెలకొంది. రామగుండంలో 50 వార్డులు, బడంగిపేటలో 32 వార్డులు, మీర్‌పేటలో 46 వార్టులు, బండ్లగూడ జాగీర్‌లో 22, బోడుప్పల్‌లో 28, ఫీర్జాదీగూడలో 26, జవహర్‌నగర్‌లో 28, నిజాంపేటలో 33, నిజామాబాద్‌లో 60, కరీంనగర్‌లో 60 మంది అభ్యర్ధులను సిద్ధం చేసుకోవడంలో పార్టీ విఫలమైందనే ఆరోపణలు వస్తున్నాయి.