తెలంగాణ

జనమంతా మావైపే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: జనమంతా తమవైపే ఉన్నారని, మున్సిపల్ ఎన్నికల్లో గులాబీ దండును మట్టి కరిపిస్తామని, కాంగ్రెస్ శ్రేణులు ప్రజలందర్నీ కలుపుకుని వెళ్లాలని పీసీసీ అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన ఇక్కడ గాంధీభవన్ నుంచి రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లోని పార్టీ నేతలతో ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, టీఆర్‌ఎస్, బీజేపీ మ్యాచ్ ఫిక్సింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నాయన్నారు. ఈ కుట్రను ప్రజలు గ్రహించాలన్నారు. ఎంఐఎం, టీఆర్‌ఎస్ పొత్తును నమ్మరాదని ఆయన మైనారిటీలను కోరారు. కేరళ అసెంబ్లీ మాదిరిగా తెలంగాణ అసెంబ్లీని ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశపరిచి పౌరసత్వ చట్టాన్ని రద్దు చేయాలని తీర్మానం చేయాలన్నారు. కాంగ్రెస్‌ను మున్సిపల్ ఎన్నికల్లో గెలిపిస్తేప్రజలకు అందుబాటులో ఉంటూ మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కేసీఆర్, కేటీఆర్‌కు షాక్ తథ్యమన్నారు. కేసీఆర్ 2018 ఎన్నికల్లో గెలిచేందుకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు. ఓట్లు దండుకోవడానికి అన్ని రకాలైన హామీలు ఇచ్చిన కేసీఆర్ జనాన్ని మర్చిపోయి ప్రగతిభవన్‌కు పరిమితమయ్యారన్నారు. నిరుద్యోగ భృతిని పట్టించుకోవడం లేదన్నారు. రైతు బంధు, రైతు రుణమాఫీ చేయని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధికి ఒక్క రూపాయి నిధులను కూడా కేటాయించలేదన్నారు. టీఆర్‌ఎస్ నేతల మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. కేసీఆర్ సర్కార్ స్థానిక సంస్థల నిధులను ఇతర పథకాలకు మళ్లించిందన్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లకు నిధులు కేటాయించాలని అడ్మినిస్ట్రేటివ్ స్ట్ఫా కాలేజీ నివేదిక ఇచ్చిందన్నారు. మున్సిపాలిటీల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందన్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని, అభ్యర్థి గెలుపు కోసం ఐక్యమత్యంగా కృషి చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవం తెస్తామని ఆయన చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనితీరుతో ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారన్నారు. ప్రజల చేత ఓట్లు వేయించుకోవడానికి ఇచ్చే తాయిలాలు పనిచేయవన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే రాష్ట్రంలో రాజకీయంగా పెను మార్పులు వస్తాయన్నారు.
'చిత్రం... మున్సిపోల్స్‌పై గాంధీభవన్‌లో శనివారం పార్టీ నేతలతో ఫేస్‌బుక్ ద్వారా మాట్లాడుతున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్