తెలంగాణ

మాకు ఎదురులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 11: మున్సిపల్ ఎన్నికల సమరం వేడెక్కింది. మరో పది రోజుల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో టీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు పార్టీ కేడర్‌లో ఉత్సాహాన్ని పెంచుతూ అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. శనివారం ఇక్కడ తెలంగాణ భవన్‌లో ఆయన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, సీనియర్ నేతలతో సమావేశమై పార్టీ వ్యూహాన్ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్లు పూర్తయినందున ప్రచారంపై ఫోకస్ పెట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన పార్టీ సమావేశాల్లో చేసిన మార్గదర్శకాలకు లోబడి పార్టీ కేడర్ పనిచేయాలన్నారు. అభ్యర్థుల ఎంపిక, బీ ఫారాలు అందజేసే విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. నామినేషన్లు పూర్తయ్యాక ఆయా పట్టణాల్లో వచ్చిన నామినేషన్లు, పార్టీ తరఫున నామినేషన్లు వేసి అభ్యర్థుల సంఖ్య, ఇతర పార్టీల నుంచి పోటీ చేస్తున్న వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. పార్టీ నుంచి రెబల్స్ అభ్యర్థులుగా పోటీలో ఉండే వారితో నామినేషన్ల ఉపసంహరణ కోసం ప్రయత్నాలు చేయాలని సూచించారు. పురపాలక సంఘాల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ప్రచారం ఉండాలన్నారు. ప్రతి ఇంటికీ టీఆర్‌ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల వివరాలు చేరాలన్నారు. అభ్యర్థులు ఇంటింటికీ తిరిగి ప్రచారం చేయాలన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ విజయం తథ్యమని, ఈ మేరకు జిల్లాల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. రానున్న పది రోజుల్లో కష్టపడి పనిచేయాలని, ఎన్నికలను సులభంగా తీసుకోవద్దన్నారు. మంత్రులతో సమావేశం సందర్భంగా ఆయా జిల్లాల్లో అన్ని పురపాలక సంఘాల్లో విజయం కోసం పనిచేయాలన్నారు. ప్రజాప్రతినిధులు వ్యక్తిగత బాధ్యత తీసుకుని పనిచేయాలన్నారు. మంత్రు లు సైతం తమ పరిధిలోని పురపాలక సంఘాల్లో జరుగుతున్న ఎన్నికల సన్నాహాలు, ప్రచారం పరిస్థితులను కేటీఆర్ వివరించారు. అత్యధిక పురపాలక సంఘాల ఎన్నికలు ఉన్న మంత్రి మల్లారెడ్డి తమ పరిధిలో టీఆర్‌ఎస్ గెలుపు తథ్యమన్నారు.
రాష్ట్రంలో విపక్ష పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మడం లేదని, ఆ పార్టీల నేతలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. టీఆర్‌ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక అనుచితమైన విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ పది రోజుల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు సమష్టి కృషి చేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా సమన్వయంతో ఉండాలని ఆయన కోరారు. పురపాలక సంఘాల అభివృద్ధికి చేసిన కృషిని ప్రజలకు వివరించాలని, ఈ విషయంలో ప్రతిపక్షాలు చేస్తున్న నిరాధారమైన సమాచారాన్ని ప్రజలకు వివరించాలన్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అత్యధిక స్థానాలు గ్యారంటీ అని తెలియడంతో విపక్షాలు టీఆర్‌ఎస్‌పై బురదజల్లుతున్నాయన్నారు. మున్సిపాలిటీల్లో గ్రా మీణ ప్రాంత నేతల సేవలను వినియోగించుకోవాలన్నారు.
'చిత్రం... మున్సిపోల్స్‌పై శనివారం టీఆర్‌ఎస్ భవన్‌లో పార్టీ ముఖ్యులతో సమావేశమైన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్