తెలంగాణ

నవనీతచోరునిగా, కాళీయమర్ధనుడిగా నరసింహుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాదగిరిగుట్ట, జనవరి 9: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం అధ్యయనోత్సవాల్లో భాగంగా గురువారం లక్ష్మీనరసింహుడు ఉదయం నవనీతచోరునిగా, సాయంత్రం కాళీయమర్ధనుడి అవతారాల అలంకార సేవలో భక్తులను అనుగ్రహించారు. నాల్గవరోజు శ్రీ స్వామి వారి నిత్యపూజల అనంతరం అధ్యయనోత్సవాల్లో దివ్య ప్రబంధ పారాయాణాలు పిదప వెన్నముద్ధ కృష్ణుడి(నవనీత చోరుడు)గా లక్ష్మీనరసింహుడిని అలంకరించి హారతినిచ్చి ఊరేగింపు వేడుక నిర్వహించారు. భగవానుడు కృష్ణావతారం బాలలీలలతో గోపికలను, గోకుల వాసులను ఆనందపరశువులను చేసిన ఘట్టమే వెన్నముద్ద కృష్ణుడని అవతార విశేషాలను అర్చక బృందం భక్తులకు వివరించింది. పంఛభూతములు, ప్రకృతి, బుద్ధి, మనస్సు, అహంకారం అనే నవవిధ తత్వముల సమాహారమే నవనీతం(వెన్న). నవనీత తత్వాలను ఉద్ధరించే తత్వమే నవనీతకృష్ణ అవతార విశేషం. మృదువుగా ఉండి కరిగిన కొలది జారిపోయే స్వభావం వెన్నది. అలాగే జారిపోయి పతనమవుతున్నవంటి జీవులను తనవైపు వశపరుచుకుని జీవాత్మలను ఉద్ధరింపచేయుట ఈ నవనీత చోరుడి అవతార అంతరార్ధం. ఏన్నో లీలలతో కూడిన నవనీతచోరుని అవతారాన్ని మహర్షులు, దేవతులు స్తుతించినట్లుగా శ్రీమహాభాగవతం చెబుతుంది.
అధ్యయనోత్సవాల్లో సాయంత్రం కాళీయ మర్ధన అవతారంతో భగవాను శ్రీకృష్ణుడు తన బాలలీలతో మానవాళికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. యమునా నదిలో సర్పరాజు కాళీయుడు విషంతో కూడిన నీళ్లు తాగిన గోవులు, గోపాలురు మృత్యువాత పడగా వారిని కృష్ణుడు తన కరుణామృతధారాలతో పునరుజ్జీవింపచేశాడని అవతార ప్రశస్తి. కాళీయుడు తన విషాగ్నితో యమునా జలాలను భగభగమండిస్తుండటంతో కాళీయుడిని సంహరించేందుకు నదిలోకి దూకిన శ్రీకృష్ణుడు కాళియుని పడగలపై ఎక్కి తాండవం చేయగా జగద్రక్షుడి బరువుకు, తాండవానికి తాళలేక కాళియుడు నెత్తురు కక్కుతు కృష్ణుడిని పరమాత్మగా గ్రహించి శరుణవేడుతాడు. శాంతించిన కృష్ణుడు తాండవం చాలించి కాళియుడిని అనుగ్రహించగా అతను సముద్రంలోకి వెలుతాడు. కాళీయుడు తన తలల ఇంద్రియాలతో విషయాలనే విషమును చిమ్ముతు గర్వంతో వ్యవహారించగా పరమాత్మ పాదస్పర్శతో ఇంద్రియాలు విషయములు(విషం)ను అణిచివేయబడుతాయని కాళీయ మర్ధనుడి అవతార కథనం. ఎలాగైతే కాళీయుడినిలోని ఇంద్రియాలను, విషయ విషాన్ని పరమాత్ముడు తన పాదతాండవంతో రూపుమాపినట్లుగా భక్తులలోని విషపూరిత భావాలను భగవంతుడు తన అనుగ్రహంతో రూపుమాపుతాడని నిర్మల మనస్కులుగా చేస్తాడని కాళీయ మర్ధనుడి అవతారం విశిష్టతగా శ్రీమహాభావతం ప్రశస్తి. ఈ అధ్యయనోత్సవాల్లో ప్రధానార్చకులు నంధీగల్ నరసింహాచార్యులు, అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చక బృందం పాల్గొన్నారు.

'చిత్రం... నవనీతచోరునిగా లక్ష్మీనరసింహుడు