తెలంగాణ

ప్రపంచ స్థాయి పంటలకు తెలంగాణ అనుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 9: ప్రపంచస్థాయి పంటలకు తెలంగాణ అనుకూలమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ వాతావరణ పరిస్థితులు ప్రపంచంలో కొన్నిచోట్ల మాత్రమే ఉన్నాయని, నాణ్యతా ప్రమాణాలు పెంచితే ప్రపంచంలో తెలంగాణ ఉత్పత్తులు నంబర్ వన్ అవుతాయని మంత్రి తెలిపారు. గురువారం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి న్యూజిలాండ్ ఎంపీ, న్యూజిలాండ్ పార్లమెంటరీ సెక్రటరీ ప్రియాంక రాధాకృష్ణన్‌తో భేటీ ఆయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు, వ్యవసాయ రంగం అభివృద్ధి కోసం చేపడుతున్న, చేపట్టనున్న వివిధ అంశాలపై ప్రియాంకకు వివరించారు. ఈ సందర్భంగా ప్రియాంక గ్రీన్ చాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరాణాన్ని రక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రియాంక పేర్కొన్నారు.
తెలంగాణలో ఎలాంటి పరిస్థితులను అయినా అధిగమించి పంటలు పండించే అవకాశం ఉందని మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.