తెలంగాణ

పౌరసత్వ చట్ట సవరణ అమలులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 14: పౌరసత్వచట్ట సవరణ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, ఈ చట్టం అమలులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. శనివారం ఆయన ఇక్కడ అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర రెండవ మహాసభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రాజకీయ ప్రకటనలు చేశారన్నారు. తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ప్రకటించడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటన చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కోరగా ఆయన పై విధంగా స్పందించారు. ఈ చట్టం పూర్తిగా కేంద్రప్రభుత్వ పరిధిలోని అంశమన్నారు. రాష్ట్రాల చేతిలో లేదన్నారు. పోలీసు వెరిఫికేషనన్‌లో జాప్యం చేయడం తప్ప ఈ చట్టం అమలు విషయంలో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదన్నారు. కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే పౌరసత్వం సవరణ చట్టాన్ని తెచ్చిందన్నారు. సామ్రాజ్యవాద కొత్త ముసుగులో అణ్వాయుధాలతో విధ్వంసాలు, మతాలు పేరిత ఘర్షణలు సృష్టించేందుకు ప్రపంచ వ్యాప్తంగా కుట్రలు సాగుతున్నాయన్నరు. అమెరికా వంటి సామ్రాజ్య దేశాలు, దోపిడీని, అశాంతిని నెలకొల్పే స్వభావం ఉన్న దేశాల విషయంలో లోతుగా ఆలోచించే సమయం ఆసన్నమైందన్నారు. ప్రపంచ శాంతి కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
*చిత్రం... రాజ్‌భవన్‌లో గల హోటల్ కత్రిలో శనివారం జరిగిన ఏఐపీఎస్‌ఓ సదస్సులో మాట్లాడుతున్న ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్